Home > క్రీడలు > విరాట్ కోహ్లీ వల్లే టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆగం అయింది: జై షా

విరాట్ కోహ్లీ వల్లే టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆగం అయింది: జై షా

విరాట్ కోహ్లీ వల్లే టీమిండియా టెస్ట్ క్రికెట్ ఆగం అయింది: జై షా
X

గత రెండేళ్లుగా టీమిండియా పరిస్థుతులు అంతగా బాగోలేవు. దానికి కారణం విరాట్ కోహ్లీ అని బీసీసీఐ సెక్రెటరీ జై షా అన్నాడు. విరాట్.. మొదట టీ20 కెప్టెన్సీకి రిటైర్మెంట్ ప్రకటించగా.. తర్వాత అతన్ని వన్డే క్రికెట్ నుంచి బీసీసీఐ తప్పించింది. ఈ వివాదాల నడుమ టెస్ట్ కెప్టెన్సీకి కూడా విరాట్ రాజీనామా చేశాడు. స్ప్లిట్ కెప్టెన్సీ వర్కౌట్ కాదని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ చెప్తుంటే.. కావాలనే విరాట్ ను కెప్టెన్సీ నుంచి తప్పించారనే ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో జై షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపాయి.

‘టీ20, వన్డేల్లో విరాట్ కు ప్రత్యామ్నాయంగా రోహిత్ అని భావించాం. అందుకే అతను కెప్టెన్సీ వదులుకున్నా జట్టుపై అంత ఇంపాక్ట్ చూపించలేదు. అయితే, విరాట్ టెస్ట్ క్రికెట్ లో టీమిండియాకు చేసింది ఇంకా ఏ క్రికెటర్ చేయలేడు. భారత్ ను ఆరేళ్లపాటు నంబర్ వన్ గా నిలబెట్టాడు. అతని స్థానంలో ఇంకొకరిని ఎప్పటికీ ఊహించుకోలేం. టీమిండియాకు విరాట్ లాంటి మరో కెప్టెట్ దొరకడు. కెప్టెన్సీకి రాజీనామా చేసినప్పుడు.. బీసీసీఐ వద్దని కోరింది. అయినా కోహ్లీ వినిపించుకోలేదు. అతని స్థానంలో ప్రత్యామ్నాయంగా ఎవరిని కెప్టెన్ చేయాలనే సందిగ్దంలో పడిపోయింది. తప్పని సరి పరిస్థితుల్లో పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ ను టెస్ట్ క్రికెట్ కెప్టెన్ చేశాం. ఆ టైంలో విరాట్ అలా చేయకుండా ఉండాల్సింద’ని జై షా అన్నాడు.

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్న తర్వాత.. టీమిండియా ద్వైపాక్షక సిరీస్ లతో పాటు, ఐసీసీ టోర్నీల్లోనూ దారుణంగా విఫలం అయింది. వరుసగా టెస్ట్ ఛాంపియన్ షిప్, టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్ లో ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. దీంతో రోహిత్ ను సారథిగా తప్పించాలంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే, జై షా కంటే ముందు కూడా సౌరవ్ గంగూలీ కూడా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ను తప్పుబట్టాడు.

Updated : 26 Jun 2023 10:17 PM IST
Tags:    
Next Story
Share it
Top