Home > క్రీడలు > IND vs PAK: షాహీన్ షా షాక్ ఇచ్చినా.. కుదురుకున్న టీమిండియా

IND vs PAK: షాహీన్ షా షాక్ ఇచ్చినా.. కుదురుకున్న టీమిండియా

IND vs PAK: షాహీన్ షా షాక్ ఇచ్చినా.. కుదురుకున్న టీమిండియా
X

టీమిండియా కథ మళ్లీ మొదటికొచ్చింది. ఆరంభంలోనే మొదటి వికెట్ కోల్పోయింది. మొదటి ఇన్నింగ్స్ లో ఊహించిన ఉత్కంఠ లేదని.. నిరుత్సాహపడ్డ ప్రపంచ క్రికెట్ అభిమానులకు తిరిగి ఊపుతెచ్చింది. కాగా టీమిండియా అభిమానులకు పాక్ బౌలర్ షాహిన్ షా షాక్ ఇచ్చాడు. టార్గెట్ తక్కువే ఉంది.. ఈజీగా చేదిస్తారు అనుకునేంతలో ఓపెనర్ శుభ్ మన్ గిల్ పెవిలియన్ చేరాడు. డెంగీ వల్ల మొదటి రెండు మ్యాచ్ లకు దూరం అయి.. రీఎంట్రీ ఇచ్చిన గిల్ తీవ్రంగా నిరుత్సాహ పరిచాడు.

192 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు 3 ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. గిల్ ఇన్నింగ్స్ దాటిగానే ఆరంభించినా.. అఫ్రిదికీ చిక్కాడు. పాక్ పై.. ఫస్ట్ పవర్ ప్లేలో వికెట్ కోల్పోవడం అనే సంప్రదాయాన్ని కొనసాగించాడు. అయితే ప్రస్తుతం టీమిండియా పటిష్టంగానే కనిపిస్తుంది. చివరి వరకు బ్యాటింగ్ చేయగల ఇన్ఫామ్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ (23, 19 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), విరాట్ కోహ్లీ (13, 11 బంతుల్లో, 4 ఫోర్లు) దాటిగా ఆడుతున్నారు.


Updated : 14 Oct 2023 7:02 PM IST
Tags:    
Next Story
Share it
Top