చేతులెత్తేసి.. సిరీస్ సమర్పించారు.. టీమిండియా ఏడేళ్లలో తొలిసారిగా..
X
వరల్డ్ క్లాస్ ఫామ్ తో దూసుకుపోతున్న బ్యాట్స్ మెన్ ఒకరు. వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాట్స్ మెన్ ఇంకొకరు. జట్టు మొత్తం ఐపీఎల్ లో సత్తా చాటిన ఆటగాళ్లే. తీరా చూస్తే.. రెండు మ్యాచుల్లో ఒక్కరిద్దరు మినహా ఏ బ్యాట్స్ మెన్ రాణించలేకపోయారు. ఫలితం ఏడేళ్లలో తొలిసారిగా టీమిండియా టీ20 సిరీస్ ఓడిపోయింది. గయాన్ వేదికపై వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. తెలుగు తేజం తిలక్ వర్మ (51, 41 బంతుల్లో), ఓపెనర్ ఇషాన్ కిషన్ (27, 23 బంతుల్లో), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (24, 18 బంతుల్లో) రాణించారు.
153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ కేవలం 18.5 ఓవర్లలలోనే లక్ష్యాన్ని చేదించింది. నికోలస్ పూరన్ (67, 40 బంతుల్లో) ఎదురు దాడికి టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారు. ఓపెనర్ల కైల్ మేయర్స్ (15, 7 బంతుల్లో) అందించిన ఆరంభానికి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ పావెల్ (21, 19 బంతుల్లో), హెట్ మేయర్ (22, 22 బంతుల్లో) క్రీజులు నిలబడి స్కోర్ సాధించారు. చివర్లో అకీర్ హసెన్ (16, 10 బంతుల్లో), అల్జారీ జోసెష్ (10, 8 బంతుల్లో) ఫినిషింగ్ అందించారు. దీంతో భారత్ ఘోరంగా ఓడిపోయింది. టీమిండియా బౌలర్లలో హార్దిక్ 3 వికెట్లు తీశాడు. చాహల్ రెండు, అర్ష్ దీప్, ముకేష్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
హార్దిక్ పై ఆగ్రహం:
కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గెలిచే మ్యాచ్ ను అతని ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఓడిపోయిందని మండిపడుతున్నారు. 16 ఓవర్ లో వరుస వికెట్లు తీసి జోరుగా ఉన్న చాహల్ కు బాల్ అందీయకుండా తనే బౌలింగ్ చేశాడు. ఒకవేళ చాహల్ కు బౌలింగ్ ఇచ్చుంటే వికెట్లు పడగొట్టి మ్యాచ్ ను మలుపు తిప్పేవాడని అంటున్నారు.