Home > క్రీడలు > చరిత్ర సృష్టించిన టీమిండియా.. తొలి టెస్ట్ విజయం

చరిత్ర సృష్టించిన టీమిండియా.. తొలి టెస్ట్ విజయం

చరిత్ర సృష్టించిన టీమిండియా.. తొలి టెస్ట్ విజయం
X

భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో చారిత్రాత్మక విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 75 పరుగుల టార్గెట్ ను టీమిండియా 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ స్మృతి మందన్న 38 నాటౌట్ రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఆసీస్ పై భారత మహిళల జట్టుకిదే తొలి టెస్టు విజయం కావడం విశేషం.

డిసెంబెర్ 21న మొదలైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆసీస్ 219 పరుగులకే ఆలౌట్ కాగా.. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 406 పరుగులు చేసి, భారీ అధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 261 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. ఆసీస్ నిర్దేశించిన 75 పరుగుల టార్గెట్ ను టీమిండియా సునాయసంగా చేదించింది. దీంతో ఇంకా ఒక రోజు ఆట మిగిలి ఉండగానే భారత్ గెలుపు నమోదు చేసింది. టీమిండియా ఆసీస్ తో ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడగా.. తొలిసారి గెలిచింది.

Updated : 24 Dec 2023 9:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top