Home > క్రీడలు > INDvsSA : కుప్పకూలిన టీమిండియా.. తక్కువ స్కోర్కే ఆలౌట్

INDvsSA : కుప్పకూలిన టీమిండియా.. తక్కువ స్కోర్కే ఆలౌట్

INDvsSA : కుప్పకూలిన టీమిండియా.. తక్కువ స్కోర్కే ఆలౌట్
X

కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తాశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 153 రన్స్కే భారత్ ఆలౌట్ అయ్యింది. కోహ్లీ (46), రోహిత్ శర్మ (39), శుభ్‌మన్‌ గిల్‌ (36) తప్ప.. అందరూ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఆరుగురు బ్యాట్స్మెన్లు డకౌట్ అవ్వడం గమనార్హం. 110 పరుగులకు 4 వికెట్లను కోల్పోయిన టీమిండియా.. 153 రన్స్ వద్ద మిగితా ఆరు వికెట్లు పడ్డాయి. దీంతో సౌతాఫ్రికాపై 98 రన్స్ ఆధిక్యంలో ఉంది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు భారత బౌలర్ల దెబ్బకు 55 పరుగులకే కుప్పకూలింది. కట్టుదిట్టంగా బంతులు వేస్తూ సౌతాఫ్రికాకు చుక్కలు చూపించారు. కాగా టెస్ట్ చరిత్రలో భారత్ లేదా ఇతర ఏ దేశంతోనైనా.. సౌతాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. కీలక మ్యాచ్లో రెచ్చిపోయిన సిరాజ్ నిప్పులు చెరిగాడు. తన కెరీర్ బెస్ట్ 6-15 (9 ఓవర్లలో) నమోదు చేసుకున్నాడు. ప్రొటీస్ పతనానికి ముఖ్య కారకుడయ్యాడు. గత మ్యాచ్లో సెంచరీ హీరో, కెప్టెన్ డీన్ ఎల్గర్ (4)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఐడెన్ మార్క్రమ్ను (2) స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. టోనీ డి జోర్జీ (2)ని కీపర్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత డేవిడ్‌ బెడింగ్‌హామ్‌ (12), కైల్‌ వెర్రీన్నె (15), మార్కో జాన్‌సెన్ (0)ల వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, ముకేశ్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టి.. సౌతాఫ్రికా పతనంలో భాగస్వామ్యులయ్యారు.

Updated : 3 Jan 2024 3:37 PM GMT
Tags:    
Next Story
Share it
Top