IND vs PAK: టీమిండియా బ్యాటర్ల విశ్వరూపం.. పాక్ బౌలర్లకు చుక్కలు
X
కొలంబో స్టేడియంలో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (56,, 49 బంతుల్లో), శుభ్ మన్ గిల్ (58, 52 బంతుల్లో) అందించిన శుభారంభాన్ని విరాట్ కోహ్లీ (122, 84 బంతుల్లో), కేఎల్ రాహుల్ (111, 106 బంతుల్లో) కొనసాగించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. వర్షం కారణంగా నిన్నటి మ్యాచ్ రద్దు కావడంతో.. ఇవాళ రిజర్వ్ డే ఆడించారు. అయితే మొదటి రోజు కాస్త నెమ్మదిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రాహుల్, కోహ్లీ.. రిజర్వ్ డే రోజు రెచ్చిపోయారు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. విరాట్, రాహుల్ విశ్వరూపం చూపించారు. దుర్భేద్యమైన పాక్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. మూడో వికెట్ కు విరాట్, రాహుల్ 230 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. పాక్ బౌలర్లలో అఫ్రిది, నజీమ్ షా చెరో వికెట్ పడగొట్టారు.
ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ వన్డేల్లో 13వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ మైలు రాయిని అందుకున్న 6వ భారత్ బ్యాటర్ విరాట్. అంతేకాకుండా ఈ ఫీట్ అతి తక్కువ ఇన్నింగ్స్ లో (267) సాధించడం విశేషం. పునరాగమనం అందించిన రాహుల్ కూడా రాణించాడు. అద్భుత సెంచరీతో (111,106 బంతుల్లో) ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా విరాట్, రాహుల్ భాగస్వామ్యంలో (233) 1000 పరుగులు పూర్తయ్యాయి. అంతేకాకుండా పాక్ పై ఎక్కువ పరుగుల పార్ట్ నర్షిప్ సాధించిన జోడీగా రికార్డుకెక్కారు.