Home > క్రీడలు > India vs Australia: టీ20 అనుకున్నాడేమో.. ఆసీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు

India vs Australia: టీ20 అనుకున్నాడేమో.. ఆసీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు

India vs Australia: టీ20 అనుకున్నాడేమో.. ఆసీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు
X

భారత బ్యాటర్లు ఫామ్ లోకి వచ్చారు. ఇండోర్ లో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించారు. టాప్ ఆర్డర్ శ్రేయస్ అయ్యర్ (105), శుభ్ మన్ గిల్ (104) సెంచరీలు చేశారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్ (52) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. చివర్లో సూర్య కుమార్ యాదవ్ (71 నాటౌట్) ఆసీస్ పై తన ప్రతాపం చూపించాడు. టీ20 అనుకున్నాడో ఏమో 6 సిక్సర్లు, 6 ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. దాంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు భారీ స్కోర్ చేసింది. కాగా ఇది సూర్యకు వన్డేల్లో రెండో సెంచరీ. ఆసీస్ బౌలర్లు ఇండోర్ గ్రౌండ్ లో తేలిపోయారు. భారత బ్యాటర్ల దాటికి చేతులెత్తేశారు. గ్రీన్ 2 వికెట్లు పడగొట్టినా 10 ఓవర్లు వేసి 103 పరుగులు ఇచ్చుకున్నాడు. హాజెల్ ఉడ్ 1, సిఆన్ అబాట్ 1, జాంపా 1 వికెట్ పడగొట్టారు.

Updated : 24 Sept 2023 6:55 PM IST
Tags:    
Next Story
Share it
Top