విండీస్తో టెస్ట్.. ప్రపంచ రికార్డు నెలకొల్పిన టీమిండియా
X
ట్రినిడాడ్ వేదికపై వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా ప్రపంచ రికార్డ్ ను బద్దలు కొట్టింది. మొదటి టెస్ట్ నుంచి ఆచితూచి ఆడిన భారత బ్యాటర్లు.. రెండో టెస్టులో గేర్ మార్చి దూకుడు పెంచారు. టెస్ట్ మ్యాచ్ అని మరిచి.. విండీస్ బౌలర్లను చితక్కొట్టారు. సిక్సర్లు, ఫోర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రికార్డును భారత్ నెలకొల్పింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (57, 44 బంతుల్లో), జైశ్వాల్ (38, 30 బంతుల్లో) శుభారంభాన్ని అందించారు. తర్వాత నాలుగో వికెట్లో వచ్చిన ఇషాన్ (52, 34 బంతుల్లో) సాధించాడు. అందులో 2 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. ఈ క్రమంలో టీమిండియా 12.2 ఓవర్లలోనే 100 పరుగులు దాటేసింది. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా టీమిండియా రికార్డ్ నెలకొల్పింది. ప్రస్తుతం 364 పరుగుల భారీ లక్ష్యంతో భరిలోకి దిగిన విండీస్ 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది.