Home > క్రీడలు > హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.. విండీస్కు భారీ టార్గెట్

హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.. విండీస్కు భారీ టార్గెట్

హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.. విండీస్కు భారీ టార్గెట్
X

ట్రినిడాడ్ వేదికపై జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా కుర్రాళ్లు దంచికొట్టారు. రెండో వన్డేలో ఓడిపోయామన్న కసితో.. విండీస్ బౌలర్లను చితక్కొట్టారు. స్పిన్నర్, పేసర్.. బౌన్సర్లకు భయపడకుండా చెలరేగిపోయారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 351పరుగులు చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (77, 64 బంతుల్లో), శుభ్ మన్ గిల్ (85, 92 బంతుల్లో) రాణించారు. సంజూ శాంసన్ (51, 41 బంతుల్లో) 4 సిక్సర్లతో విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివర్లో మరో వికెట్ పడకుండా కెప్టెన్ హార్దిక్ పాండ్యా (70, 52 బంతుల్లో), సూర్య కుమార్ (35, 30 బంతుల్లో) సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో సూర్య ఔట్ అయినా.. జడేజా (8, 7 బంతుల్లో), హార్దిక్ సహకారంతో టీమిండియాకు భారీ ఆధిక్య లభించింది.

మ్యాచ్ లో భారత బ్యాటర్లు రాణించినా.. మూడో వికెట్లో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (8, 14 బంతుల్లో) నిరాశ పరిచాడు. అల్జారీ జోసెఫ్ బౌలింగ్ లో చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసఫ్, మోటీ, కారియాకు చెరో వికెట్ దక్కింది. షెపర్డ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఫామ్ లో ఉన్న విండీస్ బ్యాటర్లను టీమిండియా బౌలర్లు ఎలా నిలవరిస్తారో? సిరీస్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.


Updated : 1 Aug 2023 5:31 PM GMT
Tags:    
Next Story
Share it
Top