IND vs SA: 46 ఓవర్లకే భారత్ ఆలౌట్.. ఆదుకున్న సుదర్శన్, రాహుల్
X
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా.. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో టాస్ ఓడిన టీమిండియా బ్యాటింగ్ చేసింది. బ్యాటర్లు దారుణంగా విఫలం అవడంతో.. 46.2 ఓవర్లలో 211 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (4), మూడో వికెట్ లో వచ్చిన తిలక్ వర్మ (10. 30 బంతుల్లో) మరోసారి విఫలం అయ్యారు. ఓపెనర్ సాయి సుదర్శన్ (62, 83 బంతుల్లో నాటౌట్), కెప్టెన్ కేఎల్ రాహుల్ తో (56, 64 బంతుల్లో) కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. దాంతో టీమిండియా చెప్పుకోదగ్గ స్కోర్ చేయగలిగింది.
వ్యక్తిగత కారణాలతో శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరం కాగా.. సంజూ శాంసన్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే చాలాకాలంగా జట్టుకు దూరంగా ఉంది ఎంట్రీ ఇచ్చిన సంజూ (12, 23 బంతుల్లో).. మరోసారి నిరాశ పరిచాడు. టీ20 సంచలనం రింకూ సింగ్ (17, 14 బంతుల్లో) దాటిగా ఆడే ప్రయత్నం చేసి ఔట్ అయ్యాడు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (7, 23 బంతుల్లో) ఫెయిల్ అయ్యాడు. చివర్లో అర్ష్ దీప్ సింగ్ (18, 17 బంతుల్లో) కొస మెరుపు అందించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో నాంద్రే బర్గర్ 3 వికెట్లు పడగొట్టాడు. విలియమ్స్ 1, హెడ్రిక్స్ 2 వికెట్లు దక్కాయి.