ప్రాక్టీస్పై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్పెషల్ ఫోకస్.. వీడియో వైరల్
X
టీమిండియా టెస్ట్ మోడ్ లోకి ఎంటర్ అయింది. సెంచురియాన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగే బాక్సింగ్ డే టెస్ట్ సిరీస్ కోసం సిద్ధం అవుతుంది. రేపటి నుంచి ప్రారంభం కాబోయే ఈ సిరీస్ లో అందరి దృష్టి విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మలపైనే ఉంది. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత రెస్ట్ తీసుకుని జట్టుకు దూరంగా ఉన్న వీరిద్దరు.. ఈ టెస్ట్ సిరీస్ ద్వారా జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాకుండా భారత్ దాదాపు 5 నెలల తర్వాత టెస్ట్ ఫార్మట్ ఆడనుంది. గత మూడు దశాబ్దాలుగా సఫారీ గడ్డపై టెస్ట్ సీరీస్ నెగ్గని టీమిండియా.. ఈసారి రోహిత్ కెప్టెన్సీలో గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ప్లేయర్లంతా నెట్స్ లో శ్రమిస్తున్నారు. సీనియర్ ప్లేయర్లైన రోహిత్, కోహ్లీపైనే అందరు దృష్టిపెట్టారు.
రోహిత్ శర్మ ఆటతీరు మారాలి:
ఈ క్రమంలో రోహిత్ శర్మ తన ఆటతీరు మార్చుకోవాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించారు. ప్రస్తుతం రోహిత్ మైండ్ సెట్ దూకుడుగా ఉంది. టీ20, వన్డే వరల్డ్ కప్ లో అదే చూశాం. సౌతాఫ్రికాతో ఆడబోయేది టెస్టు సిరీస్ కు అనుగుణంగా ఓపికగా ఆడాలి. తొలిరోజు ముగిసేవరకూ రోహిత్ క్రీజులో ఉంటే అతడి స్కోరు 150 ప్లస్, టీమ్ స్కోరు 300 ప్లస్ గా ఉంటుందని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
టెస్టు సిరీస్ షెడ్యూల్:
తొలి టెస్టు- డిసెంబరు 26 - 30 వరకు- సెంచురియాన్ (మధ్యాహ్నం 1:30- భారతీయ కాలమానం ప్రకారం)
రెండో టెస్టు- జనవరి 03 - 07 వరకు- కేప్‌టౌన్ (మధ్యాహ్నం 2:00- భారతీయ కాలమానం ప్రకారం)
భారత్ జట్టు :
రోహిత్ శర్మ (c), శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్‌ప్రిత్ బుమ్రా (v/c), ప్రసిద్ధ్ కృష్ణ.
Test Match Mode 🔛#TeamIndia batters are geared up for the Boxing Day Test 😎#SAvIND pic.twitter.com/Mvkvet6Ed9
— BCCI (@BCCI) December 25, 2023