ఎట్టకేలకు తొలి విజయం.. పరువు కాపాడుకున్న టీమిండియా
X
భారత టూర్ కు వచ్చిన ఇంగ్లాండ్ మహిళల జట్టు అదరగొట్టింది. 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో సత్తాచాటిన ఇంగ్లాండ్ 1-2తో కైవసం సిరీస్ చేసుకుంది. కాగా నిన్న ముంబై వేదికపై జరిగిన మూడో టీ20లో ఎట్టకేలకు భారత్ విజయం సాధించింది. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న ఇంగ్లాండ్.. చివరి మ్యాచ్ లో కూడా నెగ్గి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని చూసింది. కానీ చివరి మ్యాచ్ లో గెలిచి భారత మహిళల జట్టు కాస్త ఊరటనిచ్చింది. కాగా మొదట బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను కట్టడి చేసిన భారత్.. తర్వాత బ్యాటింగ్ లో రాణించి విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 127 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 19 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి చేదించింది.
లక్ష్య చేదనంలో ఆరంభంలోనే భారత ఓపెనర్ షఫాలీ వర్మ (6) వికెట్ కోల్పోయింది. దీంతో టీమిండియాకు కష్టాలు తప్పవని భావించారంతా. కానీ మొదటి వికెట్ లో వచ్చిన జెమియా రోడ్రిగ్స్ (29).. ఓపెనర్ స్మృతి మందనాతో కలిసి గెలుపు దిశగా జట్టును నడిపించారు. స్పిన్ కు అనుకూలించిన వాంఖడే పిచ్ పై ఇంగ్లాండ్ బౌలర్లు తేలిపోయారు. చివర్లో అమన్ జ్యోత్ కౌర్ (10) రెండు బౌండరీలు బాది టీమిండియాకు విజయాన్ని అందించింది. టీ20 సిరీస్ ముగియడంతో ఇరు జట్ల మధ్య ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఈనెల 14 నుంచి ఏకైక టెస్టు జరగాల్సి ఉంది.