IND vs PAK : బాలింగ్ ఎంచుకున్న టీమిండియా.. పిచ్ రిపోర్ట్ ఏం చెప్తుంది?
X
అహ్మదాబాద్ వేదికపై పాకిస్తాన్ తో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. డెంగీ జ్వరం కారణంగా మొదటి రెండు మ్యాచ్ లకు దూరం అయిన గిల్ ఈ మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇషాక్ కిషన్ బెంచ్ కు పరిమితం అయ్యాడు. ఈ మ్యాచ్ లో కూడా అశ్విన్ బదులు శార్దూల్ ఠాకూర్ ను ఎంపిక చేశారు.
పిచ్ రిపోర్ట్:
ఇవాళ్టి అహ్మదాబాద్ పిచ్ పూర్తిగా పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంది. బంతి రెండు వైపులా స్వింగ్ అవుతుంది. పిచ్ పూర్తిగా ఫ్లాట్ ఉందని కామెంటేటర్స్ చెప్తున్నారు. రెండో ఇన్నింగ్స్ కు పిచ్ పై కొంత తేమ వచ్చి పరిస్థితి మారే అవకాశం ఉంది.
తుది జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్