IND vs AUS: పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. ఖాతా తెరవకుండానే
Bharath | 8 Oct 2023 6:58 PM IST
X
X
చెపాక్ లో ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చిపోతున్నారు. టీమిండియా బ్యాటర్లపై ఎదురుదాడికి దిగారు. మేమేం తక్కువ కాదన్నట్లు బౌలింగ్ చేస్తున్నారు. దీంతో మొదటి 2 ఓవర్లలోనే టీమిండియా 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, నాలుగో వికెట్ లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ డకౌట్ గా పెవిలియన్ చేరారు. మొదటి ఓవర్ లోనే ఇషాన్ వికెట్ కోల్పోగా.. రెండో ఓవర్ వేసిన హాజెల్ వుడ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. రోహిత్ ఎల్బీ డబ్ల్యూ కాగా.. అయ్యర్ వార్నర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. భారత్ 2 పరుగులతో ఖాతా తెరిచిన.. ఆ రెండు రన్స్ ఎక్స్ ట్రాలుగానే వచ్చాయి. 200 పరుగుల స్వల్ప లక్షమే అయినా.. ఇప్పుడు టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉంది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.
Updated : 8 Oct 2023 7:01 PM IST
Tags: World Cup IND vs AUS ODI World Cup 2023 icc world cup 2023 world cup 2023 cwc2023 cricket world cup 2023 rohit sharma Ishan Kishan Shreyas Iyer Starc Hazlewood reduce india 3 wickets down jadeja bumrah kuldeep yadav virat kohli shubman gill warner sports news cricket news David Warner australia total india target india score 2nd innings
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire