Home > క్రీడలు > Asian Games 2023 : షూటింగ్లో 4 పతకాలు సాధించిన హైదరాబాదీ..

Asian Games 2023 : షూటింగ్లో 4 పతకాలు సాధించిన హైదరాబాదీ..

Asian Games 2023 : షూటింగ్లో 4 పతకాలు సాధించిన హైదరాబాదీ..
X

ఆసియా గేమ్స్ 2023లో భారత్ జోరు కొనసాగుతోంది. శుక్రవారం భారత అథ్లెట్లు 2 గోల్డ్ మెడల్స్‌తో సహా మొత్తం 8 పతకాలు సాధించారు. షూటింగ్‌ విభాగంలో 5 మెడల్స్ దక్కాయి. హైదరాబాదీ యంగ్ షూటర్‌ ఇషా సింగ్ సిల్వర్ మెడల్ సాధించింది. 18ఏండ్ల ఈషా ఆసియా గేమ్స్ లో ఇప్పటి వరకు 4 పతకాలు సాధించి రికార్డు సృష్టించింది. 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీం విభాగంలో గోల్డ్, వ్యక్తిగత విభాగంలో సిల్వర్ సాధించిన ఇషా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీం, వ్యక్తిగత విభాగాల్లో సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది.

ఇక ఎయిర్ పిస్టల్ విభాగంలో పలక్ గులియా గోల్డ్, సిల్వర్ సాధించింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన పలక్.. టీం విభాగంలోనూ సిల్వర్ సాధించింది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో పలక్‌ 242.1 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. హైదరాబాదీ యువ షూటర్‌ ఇషా సింగ్‌ 239.7పాయింట్లు సాధించింది. వీళ్లిద్దరూ దివ్యతో కలిసి 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీం విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. ఎయిర్ పిస్టల్ షూటింగ్లో ఇషా 579 పాయింట్లు సాధించగా.. పలక్‌ 577, దివ్య 575 పాయింట్లు నమోదు చేసింది. 1731 పాయింట్లతో భారత్‌ రెండో స్థానం సాధించగా... చైనా (1736) పసిడి నెగ్గగా.. చైనీస్‌ తైపీ (1723) కాంస్యం దక్కించుకుంది.

భారత పురుష షూటర్లు కూడా అదే జోరును కొనసాగించారు. 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ ఈవెంట్లో ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌, స్వప్నిల్‌ కుశాలె, అఖిల్‌ షియొరాన్‌లతో కూడిన భారత జట్టు ప్రపంచ రికార్డు స్కోరుతో స్వర్ణం సాధించింది. 1769 పాయింట్లతో ఈ జట్టు అగ్రస్థానంలో నిలవగా.. చైనా టీం 1763 పాయింట్లతో రెండో స్థానం, దక్షిణ కొరియా 1748 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకున్నాయి.

Updated : 30 Sept 2023 9:36 AM IST
Tags:    
Next Story
Share it
Top