Pro Kabadi : తెలుగు టైటాన్స్ చెత్త ప్రదర్శన.. టోర్నీలో 16వ ఓటమి
X
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10లో తెలుగు టైటాన్స్ ఘోర ప్రదర్శన కొనసాగుతుంది. చెత్త ఆటతీరుతో ఇప్పటికే పాయింట్స్ టేబుల్ లో అట్టడుగు స్థానంలో ఉన్న తెలుగు టైటాన్స్.. ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. టోర్నీలో 16వ పరాభవాన్ని మూటగట్టుకుంది. శనివారం దబాంగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 44-33 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దబాంగ్ ఢిల్లీ కెప్టెన్ అషు మాలిక్ 20 రైడ్ పాయింట్స్ తో సత్తాచాటాడు. ఆశిష్ 6, మంజీత్ 5 పాయింట్స్ తో రాణించారు. తెలుగు టైటాన్స్ రైడర్ పవన్ షెరావత్ 9 పాయింట్స్ చేశాడు. రాబిన్ చౌదరీ 8 పాయింట్స్ సాధించినా ఫలితం లేకపోయింది. ఆరంభం నుంచే దూకుడు కనబరిచిన ఢిల్లీ.. తెలుగు టైటాన్స్ ను చిత్తు చేసింది.
ఫస్టాఫ్ లో తెలుగు టైటాన్స్ మెరుగైన ప్రదర్శనే చేసింది. 19-14తో లీడ్ లో నిలిచింది. ఆ తర్వాత సెకండ్ ఆఫ్ లో పుంజుకున్న ఢిల్లీ.. టైటాన్స్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. చివరి వరకు ఆధిపత్యం కొనసాగించి విజయాన్ని నమోదుచేసింది. ఈ మ్యాచ్ లో రెండు జట్లు 48 సార్లు రైడింగ్ కు వెళ్లాయి. ఢిల్లీ 20, తెలుగు టైటాన్స్ 16 సార్లు సక్సెస్ అయ్యాయి. ఢిల్లీ ఓ సూపర్ రైడ్ కూడా చేసింది. 24సార్లు ట్యాక్లింగ్ జరగ్గా.. ఢిల్లీ 13 సార్లు సక్సెస్ అయింది. టైటాన్స్ 32 ప్రయత్నాల్లో 12 సార్లు మాత్రమే పాయింట్స్ సాధించింది.