Sunil Gavaskar : ముంబై ఇండియన్స్ కెప్టెన్ను మార్చడానికి కారణం అదే..సునీల్ గవాస్కర్
X
ఐపీఎల్‌లో(IPL) మోస్ట్ సక్సెక్ ఫుల్ కెప్టెగా ఉన్న రోహిత్ శర్మను (Rohit Sharma) కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించి ముంబై ఇండియన్స్(Mumbai Indians) వార్తల్లో నిలిచింది. జట్టుకు ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మ స్థానంలో యువ క్రికెటర్ హార్దిక్ పాండ్యను సారథిగా నియమించింది. దీనిపై ముంబై కోచ్ మార్క్ బౌచర్ వ్యాఖ్యలు, రోహిత్ శర్మ భార్య రితికా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్‌గా మారాయి. హిట్‌మ్యాన్ అభిమానులు కూడా జట్టు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. అయితే, క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) మాత్రం ముంబైకి మద్దతుగా నిలిచాడు. కెప్టెన్‌ను మార్చడానికి గల కారణాలపై తన అభిప్రాయాన్ని గవాస్కర్ తెలిపాడు.
ముంబై జట్టు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుందని అన్నారు. రోహిత్‌కు ఇప్పుడు 36 ఏళ్లని...ఇప్పటికే అతను తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం హిట్ మ్యాన్ టీమ్‌ఇండియాకు మూడు ఫార్మాట్లలోనూ సారథిగా ఉన్నాడని గుర్తు చేశారు. అతడిపై ఉన్న భారాన్ని కొంత తగ్గించాలనే ఉద్దేశంతోనే..యంగ్ క్రికెటర్ హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమించినట్లు తెలిపారు. దీంతో ముంబై ఇండియన్స్‌తోపాటు రోహిత్‌కు కూడా లాభం ఉంటుందని చెప్పారు. దీంతో హిట్‌మ్యాన్ మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. టాప్ ఆర్డర్‌లో అతడు మరిన్ని పరుగులు రాబడితే జట్టుకు కలిసొస్తుందని చెప్పిన ఆయన...హార్దిక్ మూడు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయగలడని సమర్ధించారు. అప్పుడు ముంబై ప్రతి మ్యాచ్‌లోనూ 200+ స్కోరు చేసే అవకాశాలు ఉంటాయని గవాస్కర్ తెలిపారు. అయితే, రోహిత్ శర్మను కెప్టెన్‌గా తొలగిస్తున్నట్లు ముంబై ఇండియన్స్ ప్రకటించిన గంటలోనే.. ఆ జట్టు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 4 లక్షల మంది అన్ ఫాలో అయ్యారు. గుజరాత్ కెప్టెన్‌గా ఉన్న పాండ్యను ముంబై రికార్డు స్థాయి ధర చెల్లించి మరీ తీసుకురావడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నిర్ణయానికి వ్యతిరేకంగా ఫాన్స్ కామెంట్లు పెట్టారు.