Home > క్రీడలు > మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం
X

క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మరి కొన్ని గంటల్లో ఐపీఎల్ 17 వ సీజన్ ప్రారంభం కానుంది. చెన్నై హోం గ్రౌండ్ చెపాక్ స్టేడియం వేదికగా ఆరంభ మ్యాచ్ అట్టహాసంగా ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కేతో ఆర్సీబీ అమీతూమీ తేల్చుకొనుంది. అయితే ఐపీఎల్ ఐదుసార్లు ఛాంపియన్‌ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఈసారి కొత్త కెప్టెన్‌ నాయకత్వంలో బరిలోకి దిగనుంది. ఇన్నాళ్లు చెన్నైను గెలుపు బాటలో నడిపిన ఆ జట్టు కీలక కెప్టెన్ ధోని తన కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ధోనీ వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్ ఆ జట్టు బాధ్యలను తీసుకున్నాడు.

ఇటు ప్రతి సీజన్‌లోనూ ‘ఈసాలా కప్‌ నమదే’ నినాదంతో వచ్చే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తొలి మ్యాచ్‌కు సై అంటోంది. ఇప్పటికే డబ్యూపీఎల్ లో మహిళలు అదరగొట్టి కప్పు కైవసం చేసుకున్నారు. దీంతో వారిని ఆదర్శంగా తీసుకొని ఈ సారైనా తన మొట్ట మొదటి కప్పును ముద్దాడాలనే ఉద్దేశ్యంతో ఆర్సీబీ బరిలోకి దిగుతోంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా తమకు అచ్చొచ్చిన చెపాక్‌ వేదికపై చెలరేగేందుకు సీఎస్కే వ్యూహాలను సిద్ధం చేసుకుంది. కొత్త కెప్టన్ గైక్వాడ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుని జట్టును ముందుకు నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. అటు చాలా రోజుల తర్వాత బరిలోకి దిగుతున్న కోహ్లీపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

Updated : 22 March 2024 5:06 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top