Rishabh Pant : చిన్నారులతో కలిసి గోలీలాడిన టీమిండియా స్టార్ క్రికెటర్
X
గ్రౌండ్ లో సిక్స్ లతో హోరెత్తించే క్రికెటర్...గల్లీలో పిల్లలతో కలిసి గోలీలాడుతూ కనిపించాడు. అతనేవరో కాదు మన టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ తో అభిమానులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో నెట్ లో సాధన చేస్తున్నాడు. అయితే ఆటవిడుపుగా కొంతమంది చిన్నారి అభిమానులను కలిశాడు మన రిషబ్. వీధుల్లో తిరుగుతూ అక్కడి చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. చిన్నారులతో కలిసి తాను పిల్లాడిలా వారితో కలిసి గోలీలాడాడు. అయితే ముఖానికి కర్చీఫ్ చుట్టుకుని పిల్లలతో గోలీలాడుతున్న వీడియోను పంత్ తన ఇన్ స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐపీఎల్ లో ఢిల్లీకి పంత్ కెప్టెన్ గా వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే. తర్వలో ఐపీఎల్ స్టార్ట్ అవుతుడడంతో పంత్ ప్రాక్టీస్ కే అంకితమయ్యాడు. ప్రస్తుతం ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకొని ఫిట్ గా కనిపిస్తున్నాడు. కాగా, రేపు పంత్ ఫిట్ నెస్ టెస్టుకు హాజరుకానున్నాడని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఈ టెస్టులో పాస్ అయితే ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు మళ్లీ పంత్ కు అప్పగించే విషయంపై చర్చిస్తామని చెప్పుకొచ్చారు.