Home > క్రీడలు > రెండో సెమీస్కు వర్షం ముప్పు.. అదే జరిగితే ఫైనల్ వెళ్లే జట్టు ఇదే!

రెండో సెమీస్కు వర్షం ముప్పు.. అదే జరిగితే ఫైనల్ వెళ్లే జట్టు ఇదే!

రెండో సెమీస్కు వర్షం ముప్పు.. అదే జరిగితే ఫైనల్ వెళ్లే జట్టు ఇదే!
X

బలాబలాల్లో ఇరుజట్లూ సమవుజ్జీలే. టోర్నీలో అద్భుతంగా రాణించాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమాంతరంగా ఉన్నాయి. ఇలాంటి జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ అంటే ఎంత ఉత్కంఠ ఉంటుంది. ఐదుసార్లు చాంపియన్ ఒక జట్టు.. నాలుగుసార్లు సెమీస్‌ చేరినా.. ఫైనల్లో అడుగుపెట్టని సఫారీలు ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్ లో ఇవాళ (నవంబర్ 16) ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న ఈ కీలక పోరుకు వరుణుడు అడ్డుపడేలా ఉన్నాడు. గురు, శుక్రవారాల్లో కోల్ కతాలో వర్షంపడే అవకాశం ఉందని వాతావరణశాఖ ఇప్పటికే ప్రకటించింది. కాగా ఉదయం చిరుజల్లులు కురవగా.. గ్రౌండ్ స్టాఫ్ పిచ్ ను కవర్లతో కప్పేశారు. మధ్యాహ్నం టాస్ పడే సమయానికి వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. 75 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

అదే జరిగితే మ్యాచ్ ను రిజర్వ్ డేకు మార్చుతారు. అంటే రేపు కొనసాగిస్తారు. రేపు కూడా మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాకపోతే.. పాయింట్స్ టేబుల్ లో ఆసీస్ కన్నా సౌతాఫ్రికాను ముందుండటంతో సఫారీలను విజేతలుగా ప్రకటింస్తారు. ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఆదివారం (నవంబర్ 19) ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దశలో సౌతాఫ్రికా చేతిలో ఓడిన కంగారూలు ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ గెలుపుతో 8వసారి వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టాలని చూస్తున్నారు. కాగా చివరిసారిగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు 1999లో సెమీస్ లో తలపడ్డాయి. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఇరు జట్లు మళ్లీ సెమీస్ లో తలపడుతున్నాయి.

Updated : 16 Nov 2023 12:13 PM IST
Tags:    
Next Story
Share it
Top