Home > క్రీడలు > కాసేపట్లో భారత్-ఐర్లాండ్ మ్యాచ్...అభిమానులకు బ్యాడ్ న్యూస్

కాసేపట్లో భారత్-ఐర్లాండ్ మ్యాచ్...అభిమానులకు బ్యాడ్ న్యూస్

కాసేపట్లో భారత్-ఐర్లాండ్ మ్యాచ్...అభిమానులకు బ్యాడ్ న్యూస్
X

భారత్-ఐర్లాండ్ రెండో టీ20 మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. డబ్లిన్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతోంది. కీలకమైన ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మ్యాచ్‎కు ముందే ఓ వార్త ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. నేటి మ్యాచ్‎కు వరుణుడు ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

మ్యాచ్ జరిగే సమయంలో 30-50 శాతం వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఐపీఎల్ అదరగొట్టిన జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్ వంటి యువ ప్లేయర్స్ ఆటను తిలకిద్దామని చూస్తున్నా అభిమానులకు వర్షం రూపంలో బ్యాడ్ న్యూస్ అందింది.

తొలి టీ20కి వర్షం అడ్డంకిగా మారింది. 40 ఓవర్ల ఆటకు కేవలం 26.5 ఓవర్లు మ్యాచ్ మాత్రమే సాధ్యమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులతో నిలిచిన సమయంలో వర్షం పడింది. ఆ తర్వాత మ్యాచ్ కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 2 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించినట్లు ప్రకటించారు. రెండో టీ20లో కూడా వరుణుడే కీలక పాత్ర పోషించనున్నాడు. ఇక్కడ టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉంది.

ఎందుకంటే ఈ మైదానంలో జరిగిన 17 మ్యాచుల్లో పదింట్లో ఛేజింగ్ టీం విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా టాస్ కీలకం కానుంది.

Updated : 20 Aug 2023 1:57 PM GMT
Tags:    
Next Story
Share it
Top