Home > క్రీడలు > IND vs NEP: రెండో మ్యాచ్కూ వర్షం ముప్పు.. భారత్ ఆసియా కప్ ఆశలపై నీళ్లు?

IND vs NEP: రెండో మ్యాచ్కూ వర్షం ముప్పు.. భారత్ ఆసియా కప్ ఆశలపై నీళ్లు?

IND vs NEP: రెండో మ్యాచ్కూ వర్షం ముప్పు.. భారత్ ఆసియా కప్ ఆశలపై నీళ్లు?
X

ఎన్నో ఆశలతో ఆసియా కప్లో అడుగుపెట్టిన టీమిండియాకు వరుణుడు అడ్డుపడుతున్నారు. ఈసారి కప్ కొట్టి ధైర్యంగా వరల్డ్ కప్కు వెళ్లాలని ఆశపై నీళ్లు చల్లుతున్నాడు. ప్రపంచ మంతా ఎదురుచూసిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దై.. రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నేపాల్ మ్యాచ్ అయినా ఆడి గెలుస్తారనుకుంటే.. వరుణుడు కరుణించేలా కనిపించడం లేదు. సోమవారం (సెప్టెంబర్ 4) పల్లెకెలె వేదికపై ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. కాగా, సోమవారం కూడా 80 శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. వర్షం కారణంగా టాస్ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.





మ్యాచ్ రద్దయితే..?

వర్షం కారణంగా ఇండియా, నేపాల్ మ్యాచ్ రద్దయితే.. భారత్-పాక్ మ్యాచ్ లాగానే రెండు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. పాకిస్తాన్ ఇప్పటికే సూపర్ 4కు అర్హత సాధించగా.. రెండో జట్టుగా భారత్కు అవకాశం దక్కుతుంది. వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్ వస్తుంది. నేపాల్.. పాక్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది కావున.. ఆ జట్టుకు ఒక పాయింటే ఉంటుంది. భారత్ రెండు మ్యాచ్లు రద్దు కావడంతో.. టీమిండియా ఖాతాలో రెండు పాయింట్స్ ఉంటాయి. అలా ఒక్క మ్యాచ్ కూడా పూర్తికాకుండా టీమిండియా సూపర్ 4కు అర్హత సాధిస్తుంది. నేపాల్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. సూపర్ 4లో భాగంగా భారత్-పాక్ సెప్టెంబర్ 10న మరోసారి తలపడనున్నాయి.




Updated : 3 Sept 2023 6:32 PM IST
Tags:    
Next Story
Share it
Top