Home > క్రీడలు > సంచలన బౌలింగ్..4 బంతుల్లో 4 వికెట్లు..వీడియో వైరల్

సంచలన బౌలింగ్..4 బంతుల్లో 4 వికెట్లు..వీడియో వైరల్

సంచలన బౌలింగ్..4 బంతుల్లో 4 వికెట్లు..వీడియో వైరల్
X

అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌‌లో సంచలన రికార్డు నమోదైంది. థాయ్‌లాండ్ స్పిన్నర్ తిప్చా పుట్టావాంగ్ డబుల్ హ్యాట్రిక్ సాధించింది. నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్‌లో పుట్టావాంగ్ వరుసుగా నాలుగు వికెట్లు తీసి అరుదైన ఘనత అందుకుంది. 18వ ఓవర్‌లో ఫెబ్ మోల్కెన్‌బోర్, మిక్కీ జ్విల్లింగ్, హన్నా లంధీర్ మరియు కరోలిన్ డి లాంగే వికెట్లను పడగొట్టింది. నలుగురు బౌల్డే కావడం విశేషం. ఈ మ్యాచ్ లో పుట్టావాంగ్ 5/8తో గణాంకాలు నమోదు చేసింది.

ఈ అరుదైన మైలు రాయిని అందుకున్న జాబితాలో జర్మనీ స్పిన్నర్‌ అనురాధ దొడ్డబల్లాపూర్, బోట్స్వానా బౌలర్‌ షమీలా మోస్వీ ఉన్నారు. వారి తర్వాత పుట్టావాంగ్ నిలిచింది. ఓవరాల్‌గా పురుషులు, మహిళల క్రికెట్‌లో ఈ అరుదైన ఫీట్‌ సాధించిన ఏడో క్రికెటర్‌గా పుట్టావాంగ్ చరిత్ర సృష్టించింది.

పురుషుల క్రికెట్‌లో శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం లసిత్‌ మలింగా, ఆఫ్ఘ‌నిస్థాన్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్,ఐర్లాండ్ ఫాస్ట్ బౌల‌ర్ క‌ర్టిస్ కాంఫ‌ర్‌, వెస్టిండీస్‌ బౌలర్‌ జాసన్‌ హోల్డర్‌‌లు 4 బంతుల్లో 4 వికెట్లు తీశారు. 2007 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో మలింగ ఈ ఘనత సాధించగా, 2019లో ర‌షీద్ ఖాన్ ఐర్లాండ్‌పై 4 బంతుల్లో 4 వికెట్లు తీసుకున్నాడు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్-2021 క్వాలిఫయర్‌ క‌ర్టిస్ కాంఫ‌ర్‌ డ‌బుల్ హ్యాట్రిక్‌ సాధించాడు. వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీయడాన్ని డ‌బుల్ హ్యాట్రిక్‌ అంటారన్న సంగతి తెలిసిందే.


Updated : 15 July 2023 7:30 PM IST
Tags:    
Next Story
Share it
Top