Home > క్రీడలు > Kane Williamson : మూడోసారి తండ్రైన స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్

Kane Williamson : మూడోసారి తండ్రైన స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్

Kane Williamson : మూడోసారి తండ్రైన స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్
X

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ మరోసారి తండ్రయ్యారు. కేన్ విలియమ్సన్ భార్య సారా రహీమ్ ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆ దంపతులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ విషయాన్ని కేన్ విలియమ్సన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన గారాలపట్టితో ఉన్న ఫొటోను విలియమ్సన్ పోస్ట్ చేశాడు. 'వరల్డ్ బ్యూటిఫుల్ గర్ల్‌కి స్వాగతం.. మీ సురక్షిత రాకకు, ముందుకు సాగుతున్న ఉత్తేజకరమైన ప్రయాణానికి కృతజ్ఞతలు' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. దీంతో పలువురు ఆ దంపతులకు అభినందలు తెలుపుతున్నారు.





కాగా, వీరికి ఇది మూడో సంతానం విలియమ్సన్‌ దంపతులకు 2020 డిసెంబర్‌లో అమ్మాయి మ్యాగీ జన్మించింది. రెండోసారి కుమారుడు పుట్టాడు. తండ్రైన కేన్ మామకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 'కంగ్రాట్స్ లెజెండ్' అని కేన్ పోస్ట్‌కు కామెంట్ చేశాడు. కేన్ విలియమ్సన్ దంపతులకు ఇది మూడో సంతానం. వాళ్లకు మూడేళ్ల పాప, ఒక సంవత్సరం వయస్సు ఉన్న బాబు ఉన్నాడు. ఇటీవల స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా మరోసారి తండ్రైన విషయం తెలిసిందే. అతని భార్య అనుష్కశర్మ ఫిబ్రవరి 15న మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ చిన్నారికి అకాయ్ అని పేరు పెట్టారు. గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ.. దూసుకెళ్తున్నాడు. కేవలం 10 ఇన్నింగ్స్ ల్లో 6 శతకాలతో దుమ్మురేపాడు. భీకరఫామ్ లో ఉన్న కేన్ మామకు మరింత సంతోషం యాడైంది.









Updated : 28 Feb 2024 3:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top