Home > క్రీడలు > Rohit Sharma : ఆ మాటలే మాలో పట్టుదల పెంచాయి..

Rohit Sharma : ఆ మాటలే మాలో పట్టుదల పెంచాయి..

Rohit Sharma : ఆ మాటలే మాలో పట్టుదల పెంచాయి..
X

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను సాధించింది టీమిండియా. కుర్రాళ్ల అరగ్రేటంతో బలమైన ఇంగ్లాండ్ టీమ్ పై భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బ్యాటింగ్ లో కుర్రాళ్లు జైశ్వాల్, సర్ఫరాజ్‌, ధ్రువ్‌, గిల్ తమ సత్తా చాటారు. ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లోనూ భారీగా పరుగులు సాధించారు. తాజాగా టీమిండియా సిరీస్ గెలవడంపై కెప్టెన్ రోహిత్ స్పందించారు.

సిరీస్‌ను ఇంత స్థాయిలో సాధించడం సాధారణ విషయం కాదన్నారు. ఒక దశలో కొందరు టీమిండియా జట్టుపై చేసిన వ్యాఖ్యలే మాలో పట్టుదల పెంచాయని అన్నారు. అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ లో పెద్దగా అనుభవం లేని యంగ్ స్టర్స్ తో బరిలోకి దిగామని చెప్పారు. అయితే మ్యాచుల్లో వారు చూపించిన ధైర్యం అద్భుతమన్నారు. జట్టు ఒత్తిడి ఉన్నప్పుడు కూడా కీలక ఇన్నింగ్స్ ఆడారని చెప్పారు. అందరూ సెంచరీల గురించి మాట్లాడుతుంటారు..కానీ ప్రత్యర్థ జట్టుకి చెందిన 20 వికెట్లు తీయడమూ ముఖ్యమేనని చెప్పారు. టీమిండియా బౌలర్లు చక్కగా బౌలింగ్ చేసి తమ బాధ్యతలను నిర్వర్తించారన్నారు. కుల్ దీప్ తొలి ఇన్నింగ్స్ లో సూపర్ గా బౌలింగ్ చేశాడని అన్నారు. గాయపడిన తర్వాత జట్టులోకి బౌలింగ్ చేసిన తీరు అద్భుతం అంటూ కొనియాడారు. ప్రత్యర్థ బౌలర్లను ఒత్తిడికి గురి చేయడంతో జైశ్వాల్ దిట్టా అని అన్నారు. సవాళ్లను ఎదుర్కోడం అతడికి ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇది లైఫ్ లో ఎప్పటికి నిలిచిపోయే సిరీస్ అవుతుందని రోహిత్ తెలిపాడు.




Updated : 9 March 2024 11:12 AM GMT
Tags:    
Next Story
Share it
Top