ICC ODI Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్ లేపిన భారత ప్లేయర్లు
X
ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో టీమిండియా బ్యాటర్ల జోరు నడుస్తుంది. కీలక సమయంలో ఫామ్ లోకి వచ్చిన మన బ్యాటర్లు.. దుమ్ము రేపుతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తున్నారు. దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ 10లోకి దూసుకెళ్లారు. వరల్డ్ కప్ బ్యాటింగ్ ను పరిగణంలోకి తీసుకోగా.. రోహిత్ శర్మ (719) 6వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ వరల్డ్ కప్ లో రోహిత్ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ (711) రెండు హాఫ్ సెంచరీలు చేయగా.. 9వ స్థానంలో నిలిచాడు. వరల్డ్ కప్ లో గిల్ రెండు మ్యాచ్ లు ఆడకపోయినా 818 పాయింట్స్ తో టాప్ 2లో నిలిచాడు. నెంబర్ వన్ గా బాబర్ ఆజం (836) కొనసాగుతున్నాడు. బౌలర్ల విషయానికి వస్తే సిరాజ్ మూడో స్థానానికి పడిపోగా.. కుల్దీప్ యాదవ్ 8వ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా పేసర్ హాజెల్ వుడ్ 660 పాయింట్స్ తో టాప్ లో నిలిచాడు. ఇక టీం ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. టాప్ లో టీమిండియా కొనసాగుతుంది.