Home > క్రీడలు > నా హాఫ్ సెంచరీ సమైరాకి అంకితం : తిలక్ వర్మ

నా హాఫ్ సెంచరీ సమైరాకి అంకితం : తిలక్ వర్మ

నా హాఫ్ సెంచరీ సమైరాకి అంకితం : తిలక్ వర్మ
X

వెస్టిండీస్‎తో టీ20 సిరీస్ లో భారత్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. మొదటి మ్యాచ్‎లో ఘోరంగా ఓడిన టీమిండియా రెండో మ్యాచ్‎లోను ఓటమి పాలైంది. మరోసారి భారత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బౌలింగ్ లో కొత్త పర్వాలేదనిపించినా విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ విజృంభించడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. టీమిండియా ప్రదర్శన పక్కనపెడితే తెలుగు తేజం తిలక్ వర్మ మాత్రం ఆరంగ్రేటంలోనే అదరగొడుతున్నాడు. మిగిలిన బ్యాటర్లు విఫలైమన చోట..కరేబియన్ గడ్డపై తన తడాఖా చూపిస్తున్నాడు. మొదటి టీ20లో 39 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచిన తిలక్..ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌ లో కెరీర్ లో మొదటి అర్ధసెంచరీ బాది అలరించాడు. 41 బంతుల్లో 51 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. తద్వారా టీ20 లో అత్యంత పిన్న వయసులోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన రెండో భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

రెండో టీ20లో తిలక్ వర్మ ఇన్నింగ్స్ అభిమానులను అలరించింది. మాజీలు సైతం అతని బ్యాటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తన అర్ధసెంచరీని తిలక్ వర్మ రోహిత్ శర్మ కుమార్తె సమైరాకి అంకితం ఇచ్చాడు. "రోహిత్-రితికా దంపతుల కుమార్తె సమైరాకి నా తొలి హాఫ్ సెంచరీ అంకితం ఇస్తున్నా..ఐపీఎల్ లో ముంబై ఆడడం ద్వారా సమైరాతో అనుబంధం ఏర్పడింది. అంతర్జాతీయ కెరీర్ లో తాను చేసి తొలి అర్ధసెంచరీ లేదా సెంచరీని తనకు ఇస్తానని ప్రామిస్ చేశా. ఇప్పుడు ఆమెతో సంబరాలు చేసుకునే టైం వచ్చింది" అని తిలక్ వర్మ తెలిపాడు.

రెండో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. తిలక్ వర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 51) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. హార్దిక్ పాండ్యా(24), ఇషాన్ కిషన్(27) చేశారు. గిల్(7), సూర్యకుమార్ యాదవ్(1), సంజూ శాంసన్(7) దారుణంగా విఫలమయ్యారు. వెస్టిండీస్ బౌలర్లలో అకీల హొస్సెన్, అల్జారీ జోసెఫ్, రొమారియో షెఫెర్డ్ రెండేసి వికెట్లు తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 18.5 ఓవర్లలో 155 పరుగులు చేసి గెలుపొందింది. నికోలస్ పూరన్(40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67 హా సెంచరీతో చెలరేగగా.. చివర్లో అకీల హోస్సెన్(16 నాటౌట్), అల్జారీ జోసెఫ్(10 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్ లకు చెరో వికెట్ దక్కింది.

Updated : 7 Aug 2023 3:11 PM IST
Tags:    
Next Story
Share it
Top