జూనియర్ రైనా.. పంత్ రికార్డులు బద్దలు
X
తెలుగు తేజం తిలక్ వర్మ తన సూపర్ ఫామ్ ను కొనసాగించాడు. ఐపీఎల్2023లో సత్తా చాటిన తిలక్.. ఛాన్స్ వచ్చిన విండీస్ సిరీస్ లో సత్తా చాటాడు. మొదటి టీ20లో రెచ్చిపోయిన తిలక్.. రెండో మ్యాచ్ లో 41 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టి దుమ్ము రేపాడు. ఈ ఇన్నింగ్స్ తో అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అరుదైన రికార్డును నెలకొల్పాడు. అతి తక్కువ వయసులో (20 ఏళ్ల 271 రోజులు) హాఫ్ సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్ గా నిలిచాడు. తిలక్ ముందు రిషబ్ పంత్ (21 ఏళ్ల 38 రోజులు) ఈ రికార్డ్ ను రాశాడు. ఓవరాల్ గా అందరికంటే ముందు రోహిత్ శర్మ (20 ఏళ్ల 143 రోజులు) ఉన్నాడు.
తిలక్ వర్మ ఆటను చూసిన మాజీలు, భారత అభిమానులు సురేష్ రైనాతో పోల్చుతున్నారు. రైనా స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడని పొగుడుతున్నారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్.. అటాకింగ్ షాట్స్ ఆడే తిలక్ రానున్న రోజుల్లో టీమిండియా కీలక బ్యాటర్ గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాబోయే సిరీసుల్లో కూడా అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముంబై తరుపున ఐపీఎల్ 2023లో తిలక్ ఆడిన కీలక ఇన్నింగ్స్ గురించి అందరికీ తెలిసిందే. దాంతో అందరి దృష్టిని ఆకర్శించాడు.