Home > క్రీడలు > నేటి నుంచి ఐదో టెస్ట్.. జోరుమీదున్న టీమ్‌ఇండియా

నేటి నుంచి ఐదో టెస్ట్.. జోరుమీదున్న టీమ్‌ఇండియా

నేటి నుంచి ఐదో టెస్ట్.. జోరుమీదున్న టీమ్‌ఇండియా
X

భారత్-ఇంగ్లండ్ మధ్య చివరిదైన ఐదో టెస్ట్ నేడు ప్రారంభం కానుంది. ధర్మశాల వేదికగా ఇరు జట్లు తలపడునున్నాయి. ఇప్పటికే 3-1తో ముందంజలో ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ను 4-1తో ముగించాలని టీమ్‌ఇండియా భావిస్తోంది. మరోవైపు ఎలాగైనా ఈ మ్యచ్‌లో గెలిచి పరువు దక్కించుకోవాలని ఇంగ్లండ్ చూస్తోంది. కాగా టీమ్ ఇండియా సిన్నర్ రవిచంద్ర అశ్విన్, ఇంగ్లండ్ ఆటగాడు బెయిర్‌స్టోలకు ఇది వందో టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. మరోవైపు బజ్‌బాల్‌ను నమ్ముకుంటూ భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు..హైదరాబాద్‌ టెస్టు మినహాయిస్తే..వరుసగా మూడు టెస్టుల్లో ఓటమిపాలై సిరీస్‌ చేజార్చుకుంది. మిగతా వేదికల్లో పిచ్‌లతో పోలిస్తే..భిన్నంగా కనిపిస్తున్న ధర్మశాలలో భారత్‌కు దీటైన పోటీనిచ్చేందుకు ఇంగ్లిష్‌ టీమ్‌ తహతహలాడుతున్నది. ప్రస్తుత ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్న టీమ్‌ఇండియా.. ఐదో మ్యాచ్‌ గెలిచి తమ ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకునేందుకు చూస్తున్నది.

మరోవైపు వరుస ఓటములతో కుదేలవుతున్న ఇంగ్లండ్‌.. బజ్‌బాల్‌ ప్రయోగం తర్వాత తొలి టెస్టు సిరీస్‌ను కోల్పోయిన అపప్రదను మూటగట్టుకుంది.ఇంగ్లండ్‌తో ఐదో పోరుకు భారత్‌ మార్పులు, చేర్పులతో బరిలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్ట్రైక్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తుది జట్టులోకి రానుండగా, యువ బౌలర్‌ ఆకాశ్‌దీప్‌సింగ్‌ను కొనసాగించాలా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ఒకవేళ పిచ్‌ పేస్‌కు అనుకూలించే అవకాశాలు కనిపిస్తే..బుమ్రా, సిరాజ్‌తో ఆకాశ్‌దీప్‌ తుది జట్టులో ఉండే అవకాశముంది. ఇదే జరిగితే చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌యాదవ్‌ తన స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుంది. దీంతో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో టీమ్‌ఇండియా పోటీకి దిగవచ్చు. బ్యాటింగ్‌ విషయానికొస్తే..యువ బ్యాటర్‌ రజత్‌ పాటిదార్‌ వచ్చిన అవకాశాలను చేజార్చుకుంటున్నాడు. ఆడిన మూడు టెస్టుల్లో 63 పరుగులతో నిరాశపరిచాడు. పాటిదార్‌ను తిరిగి కొనసాగిస్తారా లేక దేవదత్‌ పడిక్కల్‌కు చాన్స్‌ ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. వికెట్‌కీపర్‌, బ్యాటర్‌ ధృవ్‌ జురెల్‌ అంచనాలకు మించి అదరగొడుతుండగా, సర్ఫరాజ్‌ఖాన్‌ రాంచీ టెస్టులో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ గైర్హాజరీలో యువ క్రికెటర్లు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పట్టుదలతో ఉన్నారు.

Updated : 7 March 2024 2:32 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top