Lowest Team Scores In Test Cricket : టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్లు ఇవే
X
టెస్ట్ క్రికెట్ అంటేనే జెంటిల్మెన్ గేమ్. క్రికెట్ పుట్టి, ఎదిగింది కూడా టెస్ట్ క్రికెట్ ఫార్మట్లోనే. అందుకే ప్రతీ ప్లేయర్.. అంతర్జాతీయ క్రికెట్ లో తమ జాతీయ జట్టు తరుపున.. ఒక్కసారైనా ఈ సంప్రదాయ క్రికెట్ ను ఆడాలనుకుంటారు. క్రికెట్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. చాలామంది అభిమానులు టెస్ట్ క్రికెట్ ను చూడటం మానేశారు. అంతా ధనాధన్ ఫార్మట్ టీ20లకే అలవాటు పడిపోతున్నారు. ఈ క్రమంలో ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ను తీసుకొచ్చింది. ఇప్పుడిప్పుడు మళ్లీ టెస్ట్ క్రికెట్ పై అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా కేప్ టౌన్ వేదికగా.. సౌతాఫ్రికా- భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత పేసర్లు రెచ్చిపోయారు. సౌతాఫ్రికాను 55 పరుగులకే కుప్పకూల్చారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్ లేదా ఇతర ఏ దేశంతోనైనా.. సౌతాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.
సౌతాఫ్రికా లాంటి జట్టు.. అదీ సొంత గడ్డపై అత్యల్ప స్కోరుకు ఆలౌట్ అవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటి వరకు ఇలా ఎన్ని జట్లు అత్యల్ప స్కోర్ కు ఔట్ అయ్యాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టెస్ట్ క్రికెట్ లో ఇప్పటి వరకు 100 అంతకంటే తక్కువ స్కోరు 75 సార్లు నమోదైంది. ఈ లిస్ట్ లో మొదట న్యూజిలాండ్ జట్టు ఉంది. 1955లో ఇంగ్లాండ్ పై న్యూజిలాండ్ 26 పరుగులకే ఆలౌట్ అయింది. తర్వాత సౌతాఫ్రికా వరుసగా.. 1896లో ఇంగ్లాండ్ పై 30 పరుగులు, 1924లో ఇంగ్లాండ్ పై 30 పరుగులు,1899లో ఇంగ్లాండ్ పై ఇంగ్లాండ్ పై 35 పరుగులు ఉన్నాయి.
ఈ లిస్ట్ లో భారత్ కూడా ఉంది. ఇప్పటి వరకు టీమిండియా 7 సార్లు 100 కంటే తక్కువ పరుగులు చేసి టెస్టుల్లో ఆలౌట్ అయింది. భారత్ అత్యల్తంగా.. 2020లో ఆస్ట్రేలియాపై 36 పరుగులకు ఆలౌట్ అయింది. 1974లో ఇంగ్లాండ్ పై 42 పరుగులు, 1947లో ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాపై 58 పరుగులు చేసింది. ఈ లిస్ట్ లో భారత్, సౌతాఫ్రికా సహా దిగ్గజ దేశాలన్నీ ఉన్నాయి.