Home > క్రీడలు > T20 World Cup 2024: 20 జట్లు.. 56 మ్యాచులు.. ఈసారి పొట్టి కప్లో గట్టి పోటీనే

T20 World Cup 2024: 20 జట్లు.. 56 మ్యాచులు.. ఈసారి పొట్టి కప్లో గట్టి పోటీనే

T20 World Cup 2024: 20 జట్లు.. 56 మ్యాచులు.. ఈసారి పొట్టి కప్లో గట్టి పోటీనే
X

పొట్టి క్రికెట్ టోర్నీకి రంగం సిద్ధమైంది. అమెరికా - వెస్టిండీస్ సంయుక్త వేదికలపై జరగనున్న టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ తాజాగా ఐసీసీ విడుదల చేసింది. జూన్ 1న మొదలుకానున్న ఈ పొట్టి సమరం.. జూన్ 29న జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగుస్తుంది. ఇక వరల్డ్ కప్ అంటే అందరూ ఎదురు చూసేది భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ కోసమే. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక వరల్డ్ కప్లో అంటే.. ఆ ఉత్సాహం, ఉత్కంఠ అభిమానుల్లో వేరే లెవెల్లో ఉంటుంది. భారత్ మ్యాచ్ ల విషయానికి వస్తే.. జూన్ 5న ఐర్లాండ్ తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రపంచం ఎదురుచూస్తున్న భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ సిటీలో తలపడనున్నారు. 2022 టీ20 వరల్డ్ కప్ లో ఇరు జట్ల మధ్య సమరం ఏ రేంజ్ లో జరిగిందో అందరికీ తెలిసిందే. మెల్బోర్న్ వేదికపై, 90000 మంది ప్రేక్షకుల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో.. విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాడు.

కాగా ఈసారి టోర్నీలో ఏకంగా 20 జట్లు పాల్గొంటుండటం విశేషం. 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లి నిలిచిన జట్లు.. సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. ఇందులోని ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విడగొడతారు. ఈ రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ కు అర్హత సాధింస్తాయి. మొత్తం 55 మ్యాచ్ లు జరగనున్నాయి. లీగ్ మ్యాచ్ ల్లో ఏ1 (ఆయా స్థానంలో ఉన్న జట్లు), బీ2, సీ1, డీ2 జట్లను గ్రూప్ ఏగా నిర్ణయిస్తారు. ఏ2, బీ1, సీ2, డీ1 స్థానాల్లోని జట్లు గ్రూప్ బీలో చోటు దక్కించుకుంటాయి. వాటి మధ్య సూపర్ 8 జరుగుతుంది. అమెరికాలో 16 మ్యాచ్‌లు జరుగుతాయి. వెస్టిండీస్‌లో సూపర్‌-8, సెమీస్‌, ఫైనల్‌ సహా మొత్తం 39 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.

అమెరికాలోని లాడర్‌హిల్‌ (ఫ్లోరిడా), న్యూయార్క్‌, డల్లాస్‌ స్టేడియాలు ఆతిథ్యం ఇస్తుండగా.. కరీబియన్‌ దీవుల్లోని గయానా, బార్బడోస్‌, అంటిగ్వా అండ్‌ బర్బుడా, సెయింట్‌ విన్సెంట్‌ అండ్‌ గ్రెనడైన్స్‌, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, సెయింట్‌ లూసియా స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి.



Updated : 6 Jan 2024 10:37 AM IST
Tags:    
Next Story
Share it
Top