రెండు రౌండ్లు ముగిశాక ఫ్రాంచైజీల వద్ద మిగిలివున్న మొత్తం డబ్బు
X
ఐపీఎల్ 2024 మినీ వేలం ప్రారంభమైంది. దుబాయ్‌లోని కోకోకోలా ఎరెనా వేదికగా మంగళవారం మధ్యాహ్నం 1:00 గంట నుంచి వేలం ప్రక్రియ మొదలైంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు 77 స్లాట్‌లు కోసం పోటీపడుతున్నాయి. ఇందులో 30 వరకు విదేశీ ఆటగాళ్ల స్లాట్‌లు ఉన్నాయి. మొత్తం 333 మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. సెట్ వన్ (రెండు రౌండ్లు) ముగిసింది. మొదటి సెట్ పాల్గొన్న ఆటగాళ్లలో మొత్తం 12 మందిని ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. నలుగురు ప్లేయర్లు అన్‌సోల్డ్‌గా మిగిలారు.
ప్రస్తుతం ఆయా ఫ్రాంచైజీల వద్ద ఉన్న నగదు:
చెన్నై సూపర్ కింగ్స్: రూ. 11.6 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రూ. 23.25 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: రూ. 24.95 కోట్లు
గుజరాత్ టైటాన్స్: రూ. 37.65 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్: రూ. 32.70 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్: రూ. 13.15 కోట్లు
ముంబై ఇండియన్స్: రూ. 12.75 కోట్లు
పంజాబ్ కింగ్స్: రూ. 13.15 కోట్లు
రాజస్థాన్ రాయల్స్: రూ. 7.10 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: రూ. 5.2 కోట్లు