Home > క్రీడలు > Ranji Trophy : బోర్డు పెద్దల ఆధిపత్య పోరు.. దేశ క్రికెట్ పరువునే బజారుకీడ్చింది

Ranji Trophy : బోర్డు పెద్దల ఆధిపత్య పోరు.. దేశ క్రికెట్ పరువునే బజారుకీడ్చింది

Ranji Trophy : బోర్డు పెద్దల ఆధిపత్య పోరు.. దేశ క్రికెట్ పరువునే బజారుకీడ్చింది
X

ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ సీజన్ 2024 జనవరి 5న ప్రారంభమవ్వగా.. తొలి రోజే ఊహించని ఘటన చోటుచేసుకుంది. బీహార్ క్రికెట్ అసోసియేషన్ బోర్డ్ (బీసీఏ) పెద్దల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరులో.. క్రికెటర్లు ఆగం అయ్యారు. వారి వివాదం దేశ క్రికెట్ పరువునే బజారుకీడ్చింది. దీనికి కారణం బీసీఏ అధ్యక్షుడు, సెక్రటరీ మధ్య విబేధాలే కారణం. ఇద్దరు ఎవరికి వారే అన్నట్లు ఉండటంతో.. వీరి ఆధిపత్య పోరులో ఎవరి పక్కన ఉండాలో అర్థం కాక క్రికెటర్లు తల పట్టుకుంటున్నారు. రంజీ ట్రోఫీలో పాల్గొనేందుకు ఇద్దరు రెండు టీంలను సెలక్ట్ చేశారు. కానీ రంజీ ట్రోఫీలో పాల్గొనేందుకు ఒక రాష్ట్రం నుంచి ఒకే జట్టుకు అనుమతి ఉంటుంది. అయితే బీసీఏ అధ్యక్షుడు రాకేష్ తివారీ, సెక్రటరీ అమిత్‌ కుమార్‌ ఎవరికి వారుగా జట్లను ఎంపికచేశారు.

అంతేకాకుండా.. ముంబైతో జరిగే మ్యాచ్ కోసం ఆ ఇద్దరు.. తాము సెలక్ట్ చేసిన ఇరు జట్లను తీసుకొచ్చారు. తర్వాత తమ జట్టునే ముంబైతో ఆడించాలని వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. గ్రౌండ్ కు ముందుగా వచ్చిన రాకేష్ తివారీ జట్టునే ఆడించారు. దీంతో అమిత్ కుమార్ పక్షాన నిలబడ్డ ప్లేయర్లు పరిస్థితి అగమ్యగోచరం మారింది. మ్యాచ్ ఆడకుండానే వెనుదిరిగారు. ఇరు వర్గాల వాదనతో.. మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం అయింది.





Updated : 6 Jan 2024 1:57 PM IST
Tags:    
Next Story
Share it
Top