U19 World Cup: అండర్-19 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియా
X
అండర్ -19 ప్రపంచకప్ ఫైనల్‍లో టీమిండియా ప్రత్యర్థి ఖరారైంది. పైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది భారత్ . వరుసగా ఐదోసారి ప్రపంచకప్ ఫైనల్ చేరిన యంగ్ టీమిండియా.. ఆసీస్ అండర్-19 టీమ్‍ను ఢీకొట్టనుంది. దక్షిణాఫ్రికాలోని బెలోనీలో నేడు (ఫిబ్రవరి 8) జరిగిన అండర్ 19 ప్రపంచకప్ 2024 రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఒక వికెట్ తేడాతో ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‍పై గెలిచింది. దీంతో ఫైనల్‍లో భారత్‍తో తలపడేందుకు ఆసీస్ అర్హత సాధించింది. 180 పరుగుల లక్ష్యాన్ని 49.1 ఓవర్‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్, పాకిస్థాన్ మధ్య ఈ సెమీస్ చివరి ఓవర్ వరకు సాగింది.
ఈ రెండో సెమీఫైనల్‍లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 48.5 ఓవర్లలో 179 పరుగులు చేసి ఆలౌటైంది. అజాన్ అవాయిస్ (52), అరాఫత్ మిన్హాస్ (52) హాఫ్ సెంచరీలు చేయగా.. మిగిలిన బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ఆస్ట్రేలియా యంగ్ బౌలర్ టామ్ స్ట్రేకర్ ఏకంగా ఆరు వికెట్లతో పాక్ బ్యాటింగ్‍ను కూల్చాడు. చివరి ఓవర్లో 5 బంతులు మిగిలి ఉండగా.. ఒక వికెట్ తేడాతో గెలిచింది. 49.1 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసి ఆసీస్ విజయం సాధించింది. ఓపెనర్ హ్యారీ డిక్సాన్ (50) హాఫ్ సెంచరీ చేయగా.. చివర్లో ఓలీవర్ పీక్ (49) రాణించాడు. కీలక సమయంలో రాఫ్ మెక్‍మిలాన్ (19 నాటౌట్) అదరగొట్టి జట్టును విజయతీరాలను దాటింటాడు. పాకిస్థాన్ బౌలర్లలో అలీ రజా నాలుగు వికెట్లు తీయగా.. అరాఫత్ మిన్హాస్ రెండు, ఉబైద్ షా, నవీద్ అహ్మద్ ఖాన్ తలా ఓ వికెట్ తీశారు. చివరి వరకు పోరాడిన పాక్ ఓటమి పాలైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ ఫిబ్రవరి 11వ తేదీన బెనోనీ వేదికగా జరగనుంది.