IND vs ENG 2024 : అశ్విన్ తప్పిదం, భారత్కు పెనాల్టీ.. బ్యాటింగ్కు ముందే ఇంగ్లాండ్కు 5 పరుగులు
X
(Ashwin) రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టు బిగుస్తోంది. తొలిరోజు రోహిత్ శర్మ కెప్టెప్ ఇన్నింగ్స్, జడేజా పోరాటం, సర్ఫరాజ్ ఖాన్ చెలరేగడంతో.. భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. రెండో రోజు ఆటను కొనసాగిస్తున్న భారత్.. పటిష్ట స్థితికి చేరుకుంది. రెండో రోజు రెండో ఇన్నింగ్స్ ను అశ్విన్ (37), ధృవ్ జురెల్ (39) కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ తప్పిదంతో భారత్ కు పెనాల్టీ పడింది. ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేయకుండానే.. ఐదు పరుగులు జత అయ్యాయి. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 0 నుంచి కాకుండా 5 పరుగుల నుంచి ప్రారంభిస్తుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. భారత్ ఇన్నింగ్స్ లో 102 ఓవర్ వద్ద రెహాన్ అహ్మద్ బౌలింగ్ లో అశ్విన్ డిఫెన్స్ ఆడాడు. ఆ సమయంలో అశ్విన్ పిచ్ మధ్యలో ‘ప్రొటెక్టెడ్ ఏరియా’ పరిగెత్తాడు. అదే విషయాన్ని రెహాన్ అంపైర్ కు ఫిర్యాదు చేయగా.. అశ్విన్ కు వార్నింగ్ ఇచ్చాడు. భారత్ కు ఐదు పరుగుల పెనాల్టీ విధించాడు. దీంతో ఖాతా తెరవకుండానే ఇంగ్లాండ్ కు పరుగులు వచ్చాయి. ఈ విషయంపై అశ్విన్ అంపైర్ తో చర్చింనా ఫలితం లేకపోయింది. ఐసీసీ రూల్స్ ప్రకారం పిచ్ పై ఉన్న ప్రొకెక్టివ్ ఏరియాలో ఎవరూ పరుగులు పెట్టొద్దు.