Home > క్రీడలు > Dhruv Jurel: క్రికెట్ కిట్ కోసం బాత్రూంలో దాక్కొని బెదిరిస్తే.. అమ్మ బంగారం అమ్మి..!ఎవరీ ధృవ్ జురెల్..?

Dhruv Jurel: క్రికెట్ కిట్ కోసం బాత్రూంలో దాక్కొని బెదిరిస్తే.. అమ్మ బంగారం అమ్మి..!ఎవరీ ధృవ్ జురెల్..?

Dhruv Jurel: క్రికెట్ కిట్ కోసం బాత్రూంలో దాక్కొని బెదిరిస్తే.. అమ్మ బంగారం అమ్మి..!ఎవరీ ధృవ్ జురెల్..?
X

జనవరి 25 నుంచి స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరగబోయే 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. అందులో ఎవరూ ఊహించని యంగ్ క్రికెటర్ కు చాన్స్ ఇచ్చింది. వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ విభాగంలో ఎంపిక చేసింది. తన 23వ పుట్టినరోజుకు సరిగ్గా పది రోజుల ముందు బీసీసీఐ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. టీమిండియాకు ఆడాలన్న తన కల త్వరలోనే నెరవేరేందుకు పునాది పడింది. పటిష్ట ఇంగ్లండ్తో సొంతగడ్డపై తలపడే భారత జట్టులో తొలిసారిగా అతడికి చోటు దక్కింది. అతనెవరో కాదు.. ధృవ్ జురెల్. గతేడాది ఐపీఎల్ లో వెలుగులోకి వచ్చిన ధృవ్ జురెల్.. డిసెంబర్ లో ఇండియా ఏ తరుపున సౌతాఫ్రికాలో పర్యటించాడు. అక్కడ రెండో టెస్ట్ లో 69 పరుగులు చేశాడు. తాజాగా రంజీ ట్రోఫీలోనూ అద్భుతంగా రాణిస్తున్న జురెల్ సెలక్టర్ల కంట పడ్డాడు. ఇషాన్ కిషన్ స్థానంలో భారత జట్టుకు తొలిసారి ఎంపికయ్యాడు.

తండ్రి మాట కాదని:

జురెల్ తండ్రి నీమ్ సింగ్ జురెల్ కార్గిల్ యుద్ధంలో పోరాడాడు. ఆయనకు క్రికెట్ అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఆయన లాగే ధృవ్ జురెల్ ను కూడా ఆర్మీలోనో, ప్రభుత్వ ఉద్యోగమో చేయాలనుకున్నాడు. మొదట ధృవ్ క్రికెటర్ అవుతానంతా ఆయన ఒప్పుకోలేదు. కాని మాటవినని ధృవ్.. క్రికెట్ కిట్ కొనివ్వమని మొండికేశాడు. బాత్ రూంలో దాక్కొని.. క్రికెట్ కిట్ కొనివ్వకపోతే ఇంటి నుంచి పారిపోతానని బెదిరించాడు. దాంతో చేసేదేంలేక అతని తల్లి తన మెడలోని గొలుసు అమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చింది. ఆ త్యాగం వృధా కాలేదని.. ధృవ్ తండ్రి నీమ్ సింగ్ ఇప్పటికీ చెప్తుంటాడట.

ఆ తర్వాత జూనియర్ క్రికెట్ లో ఆగ్రా, ఉత్తర్ ప్రదేశ్ జట్లకు ఆడాడు. మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేందుకు నోయిడా వెళ్లాడు. మొదట ఢిల్లీ జట్టులో స్థానం సంపాధించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తరచూ నోయిడా నుంచి ఢిల్లీకి ప్రయాణించేవాడు. దాంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో రంగంలోని దిగిన ధృవ్ తల్లి.. అతనితో నోయిడాలో ఉండేందుకు సిద్ధం అయింది. వాళ్ల కష్టం వృధా కాలేదు. ఇండియా అండర్ 19లో స్థానం దక్కించుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనతో.. 2020 అండర్-19 వరల్డ్కప్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.

ఐపీఎల్తో కథ మారిపోయింది:

ధృవ్ జురెల్ ను.. 2022లో రాజస్థాన్ రాయల్స్ వేలంలో రూ.20 లక్షల బేస్ ప్రైజ్ కు కొనుగోలు చేసింది. అప్పటికే తన తోటి ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్, రవి బిష్ణోయ్, ప్రియం గర్గ్ లు ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చారు. 2022లో రాజస్థాన్ కొనుగోలు చేసినా.. అవకాశాలు పెద్దగా రాలేదు. రియాన్ పరాగ్ కు వరుస అవకాశాలు ఇచ్చే క్రమంలో ధృవ్ బెంచ్ కే పరిమితం అయ్యాడు. 2023 ఐపీఎల్ రియాన్ పరాగ్ విఫలం అవడంతో అతనికి అవకాశం వచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా మొదట అవకాశం దక్కించుకున్న ధృవ్.. పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్శించాడు. ఆ తర్వాత వరుస మ్యాచుల్లో ఆడే అవకాశం వచ్చింది. మొత్తం 11 మ్యాచ్ లు ఆడిన ధృవ్.. 152 పరుగులు చేశాడు. ఇండియా ఏ తరుపున రాణించి జాతీయ జట్టులో చోటు సంపాధించుకున్నాడు.




Updated : 13 Jan 2024 3:57 PM IST
Tags:    
Next Story
Share it
Top