IND vs NED: బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. సవాల్ విసిరిన నెదర్లాండ్స్
X
వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో చివరిదైన భారత్, నెదర్లాండ్స్ మధ్య పోరుకు రంగం సిద్ధం అయింది. బెంగళూరు చిన్న స్వామి వేదికపై జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు సేమ్ టీంతోనే బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్ లో కోహ్లీపైనే అందరి ఆశ. ఈ మ్యాచ్ లో విరాట్ తన 50 సెంచరీ పూర్తిచేసుకోవాలని ఆశిస్తున్నారు.
జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్ట్, పాల్ వాన్ మీకెరెన్