Home > క్రీడలు > రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై నిషేధం ఎత్తివేత

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై నిషేధం ఎత్తివేత

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై నిషేధం ఎత్తివేత
X

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు బిగ్ రిలీఫ్ దక్కింది. యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ డబ్ల్యూఎఫ్ఐపై నిషేధాన్ని ఎత్తివేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. గతంలో నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించలేకపోవడంతో భారత రెజ్లింగ్ సమాఖ్యపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిషేధం విధించింది. ఫిబ్రవరి 9న సమావేశమైన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సస్పెన్షన్ ఎత్తివేయాలని నిర్ణయిచింది. దీనికి సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్‌ల నిరసనపై ఎలాంటి వివక్షపూరిత చర్యలు ఉండవని రాతపూర్వక హామీని ఇవ్వాలని డబ్ల్యూఎఫ్ఐని వరల్డ్ రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ ఆదేశించింది.

Updated : 13 Feb 2024 10:09 PM IST
Tags:    
Next Story
Share it
Top