Home > క్రీడలు > ఉప్పల్ టెస్ట్..436 పరుగులకు టీమిండియ ఆలౌట్

ఉప్పల్ టెస్ట్..436 పరుగులకు టీమిండియ ఆలౌట్

ఉప్పల్ టెస్ట్..436 పరుగులకు టీమిండియ ఆలౌట్
X

ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో భారత్ 436 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియకు 190 రన్స్ అధిక్యం లభించింది. ఓవర్ నైట్ స్కోరు 421-7 బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇండియా 15 పరుగులకు చివరి 3 వికెట్లు కోల్పోయింది. బ్యాట్స్ మెన్లలో రవీంద్ర జడేజా 87, కేఎల్ రాహుల్ 86, యశస్వి జైశ్వాల్ 80, అక్సర్ పటేల్ 44, శిఖర్ భరత్ 41 పరుగులు సాధించారు. కెప్టెన్ రోహిత్ శర్మ 24 రన్స్ మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోరూట్ 79 పరుగులు ఇచ్చి 4 వికెట్లను కూల్చాడు. రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ చెరో రెండు వికెట్లను తీయగా.. జాక్ లీచ్ ఒక వికెట్ పడగొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ రనౌట్ అయ్యాడు. బ్యాటింగ్ లో రాణించిన జడేజా, అక్సర్ పటేల్ బౌలింగ్ లో కూడా రాణించారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో జడేజా 3, అక్సర్ పటేల్ 2 వికెట్లు తీశారు. మరోవైపు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 246 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.

Updated : 27 Jan 2024 11:13 AM IST
Tags:    
Next Story
Share it
Top