Home > క్రీడలు > కోహ్లీకి ప్రత్యర్థిగా ఆడటమే నా లక్ష్యం.. దానికోసమే ఎదురు చూస్తున్న

కోహ్లీకి ప్రత్యర్థిగా ఆడటమే నా లక్ష్యం.. దానికోసమే ఎదురు చూస్తున్న

కోహ్లీకి ప్రత్యర్థిగా ఆడటమే నా లక్ష్యం.. దానికోసమే ఎదురు చూస్తున్న
X

రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెటర్లలో మేటి ఆటగాడిగా ఎదిగాడు. ఎంతోమంది యువ ఆటగాళ్లు ఐకానిక్ గా మారాడు. చాలామంది తనతో క్రికెట్ ఆడాలని, డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవాలని భావిస్తుంటారు. కానీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సీనియర్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న షాయన్ జహంగీర్ మాత్రం కోహ్లీకి ప్రత్యర్థిగా ఆడటం అంటే ఇష్టం అంటున్నాడు. ఆ టైం కోసం ఎదురుచూస్తున్నా అని చెప్తున్నాడు.

పాకిస్థాన్ లో పుట్టి అండర్ 19 క్రికెటర్ గా తనదైన ముద్ర వేసిన బ్యాటర్ జహంగీర్.. ప్రస్తుతం అమెరికాకు షిఫ్ట్ అయిపోయి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సీనియర్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పుడు ఐసీసీ ప్రపంచకప్ 2023 క్వాలిఫైయర్ లో అమెరికా తరుపున అద్భుతంగా రాణిస్తున్నాడు. నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో మాట్లాడిన జంహంగీర్ ‘విరాట్ కు అపోజిట్ గా ఆడటమే నా అంతిమ లక్ష్యం. ఇటువంటి మెగా టోర్నీలో టీమిండియాతో తలపడాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు. జహంగీర్ తన కెరీర్ లో ఇప్పటి వరకు 9 వన్డేలు ఆడిన అతను.. 33.57 సగటుతో 235 పరుగులు చేశాడు.

Updated : 23 Jun 2023 10:35 PM IST
Tags:    
Next Story
Share it
Top