Home > క్రీడలు > కోహ్లీ ‘చికెన్‌ టిక్కా’ పోస్టులో ట్విస్ట్‌.. కోహ్లీ అబద్ధం చెప్పాడంటూ ఫ్యాన్స్..

కోహ్లీ ‘చికెన్‌ టిక్కా’ పోస్టులో ట్విస్ట్‌.. కోహ్లీ అబద్ధం చెప్పాడంటూ ఫ్యాన్స్..

కోహ్లీ ‘చికెన్‌ టిక్కా’ పోస్టులో ట్విస్ట్‌.. కోహ్లీ అబద్ధం చెప్పాడంటూ ఫ్యాన్స్..
X

విరాట్ కోహ్లీ ఓ ప్లేయర్ గా కాకుండా.. మల్టీ బ్రాండ్లకు బ్యాండ్ అంబాసిడర్ కూడా. అతను ఒక్క పోస్ట్ పెట్టి, ప్రమోట్ చేస్తే చాలు కంపెనీ షేర్లు రయ్మని పెరిగిపోతాయి. అలాంటిది కోహ్లీ ఓ ప్రొడక్ట్ పై రివ్యూ ఇస్తే ఇంకా ఏమైనా ఉందా.. అభిమానులంతా దాన్ని కొనడానికి ఎగబడతారు. తాజాగా కోహ్లీ.. మాక్ చికెట్ టిక్కా తింటూ రుచి అద్భుతంగా ఉందని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. దాంతో అభిమానులంతా ఆ చికెట్ టిక్కా కొనేందుకు ఎగబడ్డారు. దాంతో ఆ కంపెనీకి ఏకంగా 30 లక్షలకు పైగా ఆర్డర్లు వచ్చాయి. అయితే కోహ్లీ రివ్యూ వల్ల చికెట్ టిక్కా కొని తిన్న వారంతా అతన్ని ట్రోల్ చేస్తున్నారు. టేస్ట్ అసలు బాగోలేదని, డబ్బులు తీసుకుని రివ్యూలు పెడుతూ అభిమానులను మోసం చేస్తున్నారని కోహ్లీపై మండిపడ్డారు. అయితే ఆ పోస్ట్ లో ట్విస్ట్ ఉంది. మాక్ చికెట్ టిక్కాను అభిమానులు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే ఈ సమస్య ఎదురైందని కంపెనీ నిర్వాహకులు చెప్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఫిట్ నెస్ కు మారుపేరైన విరాట్ కోహ్లీ.. డైట్ లో భాగంగా పూర్తిగా వెజిటేరియన్ గా మారిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆరోగ్య సంబంధ సమస్యల కారణంగా నాన్‌వెజ్‌ నుంచి వెజిటేరియన్‌గా మారాల్సి వచ్చిందని పలు సందర్భాల్లో కోహ్లీ చెప్పాడు. అయితే అభిమానులకు మాక్ చికెన్ టిక్కాకు.. చికెన్ టిక్కాకు తేడా తెలియక ఇలా చేస్తున్నారని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వివరించాడు. ‘మాక్ చికెన్ అంటే పూర్తిగా ప్లాంట్ నుంచి తయారు చేసిన వెజిటేరియన్ ఫుడ్. ఇందులో సాయాను వాడతారు. రుచి పరంగా నాన్ వెజ్ టిక్కాకు, వెజ్ టిక్కాకు పెద్ద తేడా ఉండదు. అందుకే మాంసాహారం ‘మాక్‌’ వెర్షన్‌ను ఎక్కువగా సోయాతోనే తయారు చేస్తుంటారు. ఆ అర్థం తెలియక కోహ్లీ నాన్‌వెజ్‌ తిన్నాడంటూ వివాదాస్పదం చేయడం సరికాద’ని చెప్పుకొచ్చాడు.




Updated : 13 Dec 2023 4:05 PM IST
Tags:    
Next Story
Share it
Top