Home > క్రీడలు > బీసీసీఐ మీడియా హక్కులు.. ఐదేళ్లపాటు అంబానీకి

బీసీసీఐ మీడియా హక్కులు.. ఐదేళ్లపాటు అంబానీకి

బీసీసీఐ మీడియా హక్కులు.. ఐదేళ్లపాటు అంబానీకి
X

భారత్ వేదికగా జరిగే అన్ని అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లను అవకాశాన్ని ముకేశ్ అంబానీకి చెందిన వయాకామ్ 18 సంస్థ దక్కించుకుంది. ఇక నుంచి స్వదేశంలో ఆడే ప్రతీ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం వయాకామ్ కు దక్కింది. 2023-2028 వరకు ఐదేళ్లపాటు ప్రసార హక్కులు వయాకామ్ కు చెందుతాయని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. కాగా, టీవీ ప్రసారాలు స్పోర్ట్స్ 18లో, ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్ జియో సినిమాలో అందుబాటులో ఉంటుందని అంబానీ తెలిపారు. దీంతో సెప్టెంబర్ 2023 నుంచి మార్చి 2028 వరకు స్వదేశంలో నిర్వహించే 88 అంతర్జాతీయ ద్వైపాక్షిక మ్యాచ్ లు (అవి 103కు పెరిగే ఛాన్స్ ఉంది) వయోకామ్ ప్రసారం చేయనుంది.

ఈ 88 మ్యాచుల్లో 25 టెస్ట్ మ్యాచ్ లు, 27 వన్డే మ్యాచ్ లు, 36 టీ20 మ్యాచ్ లు ఉన్నాయి. ఈ వేలంలో సోపీ పిక్చర్స్, డిస్నీ స్టార్ నుంచి వయాకామ్ కు తీవ్ర పోటీ ఎదురైంది. వాటన్నింటిని తట్టుకుని వయాకామ్ ఎంత మొత్తానికి ప్రసార హక్కులను దక్కించుకుంది అనేది తెలియలేదు. దీంతో వయాకామ్ క్రిడా ప్రపంయంలో సరికొత్త రికార్డ్ సృష్టించినట్లయింది. టీమిండియా మ్యాచ్ లతో పాటు.. ఐపీఎల్, విమన్ ప్రీమియర్ లీగ్, పారిస్ ఒలంపిక్స్, సౌతాఫ్రికా మ్యాచ్ లు, టీ10 లీగ్, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్, సౌతాఫ్రికా20 ఫ్రాంచేజీ లీగ్, ఎన్ బీఏ, డైమండ్ లీగ్.. ఇలా ప్రపంచ వ్యప్తంగా గేమ్స్ ను లైవ్ స్ట్రీమింగ్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది.

Updated : 31 Aug 2023 7:03 PM IST
Tags:    
Next Story
Share it
Top