India vs SA : చెలరేగిన సిరాజ్.. కలిసొచ్చిన విరాట్ కోహ్లీ ప్లాన్
X
కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ చెలరేడిపోతున్నాడు. ఏకంగా 6 వికెట్లు తీసుకున్నాడు. దాంతో సౌతాఫ్రికా 46 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. బుమ్రా, ముకేశ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా.. సిరాజ్ వికెట్లు తీయడంతో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఏ ఏరియాలో బంతులు వేస్తే.. వికెట్లు తీయడం సులభం అవుతుంది, బ్యాటర్లు ఇబ్బంది పడతారో చెప్తూ కెప్టెన్ లా వ్యవహరిస్తున్నాడు. తన సీనియారిటీని అంతా ఉపయోగించి సౌతాఫ్రికా పతనంలో భాగం అవుతున్నాడు. మార్కో జాన్సన్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో స్లిప్ లో ఉన్న విరాట్.. బౌలింగ్ చేస్తున్న సిరాజ్ కు సైగ చేశాడు. బ్యాట్ ముందు, ఔట్ స్వింగర్ బంతులు వేయాలని సూచించాడు. అది పాటించిన సిరాస్ సరిగ్గా కోహ్లీ చెప్పిన చోట బంతి వేసి జాన్సన్ ను ఔట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
4TV BREAKING ** SIRAJ DESTROY SOUTH AFRICA INNINGS* 2nd Test, Cape Town, 6 WICKETS WITH JUST 16 RUNS pic.twitter.com/kD1S6u20X6
— Shakeel Yasar Ullah (@yasarullah) January 3, 2024