Home > క్రీడలు > IND vs BAN: 6 ఏళ్ల తర్వాత బౌలింగ్ చేసిన కోహ్లీ.. బెదిరిపోయిన బంగ్లాదేశ్

IND vs BAN: 6 ఏళ్ల తర్వాత బౌలింగ్ చేసిన కోహ్లీ.. బెదిరిపోయిన బంగ్లాదేశ్

IND vs BAN: 6 ఏళ్ల తర్వాత బౌలింగ్ చేసిన కోహ్లీ.. బెదిరిపోయిన బంగ్లాదేశ్
X

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ బౌలర్ అవతారమెత్తాడు. 6 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వన్డే ఫార్మట్ లో బౌలింగ్ చేశాడు. రైట్ ఆర్మ్ క్విక్ బంతులతో బంగ్లాదేశ్ బ్యాటర్లను భయపెట్టాడు. పుణెలో జరుగుతున్న మ్యాచ్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయం అయింది. హార్దిక్ పాండ్యా.. తన తొలి ఓవర్ లో మూడో బంతికి గాయపడ్డాడు. బంగ్లా ఓపెనర్ లిట్టన్ దాస్ స్ట్రైట్ డ్రైవ్ ఆడగా.. దాన్ని హార్దిక్ కాలితో ఆపేందుకు ప్రయత్నించాడు. దాంతో బాల్ హార్దిక్ కాలి మడమకు బలంగా తాకగా.. నొప్పిని తట్టుకోలేక విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి హార్దిక్ ను పరీక్షించి.. డ్రెస్సింగ్ రూంకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం స్కానింగ్ కోసం హాస్పిటల్ కు పంపించారు.

దాంతో మిగిలిన మూడు బాల్స్ ను విరాట్ కోహ్లీ బౌలింగ్ చేసి ఓవర్ పూర్తిచేశాడు. విరాట్ కోహ్లీ బాల్ చేతిలోకి తీసుకోగానే ప్రేక్షకుల్లో ఉత్సాహం రెట్టింపైంది. కోహ్లీ.. కోహ్లీ అంటూ నినాదాలు చేస్తూ మరింత జోష్ పెంచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 9 ఓవర్లో మిగిలి మూడు బంతుల్ని వేసిన కోహ్లీ.. గంటకు 103 కిలోమీటర్ల వేగంతో బంతులు వేశాడు. దీంతో బంగ్లా బౌలర్లు తెగ ఇబ్బంది పడ్డారు. మూడు బంతుతు వేసిన విరాట్.. కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. చివరిసారిగా విరాట్.. 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్ లో 2 ఓవర్లు వేసిన కోహ్లీ 12 పరుగులు ఇచ్చుకున్నాడు.


Updated : 19 Oct 2023 11:43 AM GMT
Tags:    
Next Story
Share it
Top