సచిన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ.. 50 సెంచరీలతో..
X
వాంఖడే స్టేడియం ఓ అద్భుతానికి వేదికైంది. క్రికెట్ గాడ్ సచిన్ నెలకొల్పిన రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టిన క్షణానికి సాక్ష్యంగా నిలిచింది. వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన కీలక పోరులో కోహ్లీ రెచ్చిపోయాడు. సెంచరీతో చెలరేగి.. కివీస్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఈ క్రమంలో 106 బంతుల్లో 100 పరుగులు చేసిన కోహ్లీ.. వన్డేల్లో 50 సెంచరీల చేసి సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు.
సచిన్ తన కేరీర్లో 463 వన్డేలు ఆడి 49 సెంచరీలు చేశాడు. అటు కింగ్ కోహ్లీ మాత్రం 291 మ్యాచ్‌లలో ఈ రికార్డును బ్రేక్ చేశాడు. అటు హాఫ్ సెంచరీల్లోనూ విరాట్ రికార్డు నెలకొల్పాడు. వన్డే చరిత్రలోనే అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 120 హాఫ్ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్న సంగక్కర రికార్డును 120 హాఫ్ సెంచరీలతో కోహ్లీ బద్దలగొట్టాడు. కాగా 145 హాఫ్ సెంచరీలతో సచిన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు.