Home > క్రీడలు > Virat Kohli: 15 ఏళ్లలో ఎవరూ సాధించలేని.. అతని వరకు ఎవరూ చేరుకోలేని రికార్డులు

Virat Kohli: 15 ఏళ్లలో ఎవరూ సాధించలేని.. అతని వరకు ఎవరూ చేరుకోలేని రికార్డులు

Virat Kohli: 15 ఏళ్లలో ఎవరూ సాధించలేని.. అతని వరకు ఎవరూ చేరుకోలేని రికార్డులు
X

బాల్ తో ప్రశ్న వేస్తే బ్యాట్ తో సమాధానం ఇస్తాడు. రెచ్చగొడితే.. గేమ్ లో ఆన్సర్ ఇస్తాడు. ఒకర్ని నమ్మాడా.. అతని కోసం ఎంత దూరం అయినా వస్తాడు. చేయందించి నిలబడేలా చేస్తాడు. అతని గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇంతకీ అతనెవరో కాదు విరాట్ కోహ్లీ. ఒంటి చేత్తో టీమిండియా క్రికెట్ ను శిఖరానికి చేర్చే సత్తా ఉన్న విరాట్.. సరిగ్గా 15 ఏళ్ల క్రితం.. తన 19 ఏళ్ల వయసులో 2008 ఆగస్టు 18న అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు. అప్పుడెవరూ అనుకోలేదు ఆ యువ కెరటం ప్రపంచాన్ని శాసిస్తాడని. సచిన్ టెండూల్కర్ లాంటి మేటి క్రికెటర్ల సరసన నిలుస్తాడని. అరంగేట్ర మ్యాచ్ లో విమర్శలు ఎదుర్కొన్న అతనే.. ప్రపంచం తనకు సలాం కొట్టేలా చేస్తాడని. కింగ్, రన్ మెషిన్, రికార్డుల రారాజు అంటూ క్రికెట్ లో కీర్తింప బడతాడని. అంతటి కీర్తిని పొందిని విరాట్ కోహ్లీ క్రికెట్ లో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తయిందంటే.. ఫ్యాన్స్ ఎవరూ నమ్మలేకపోతున్నారు.

15 ఏళ్లలో ఎవరూ అందుకోలేరి రికార్డులను తన కెరీర్లో నెలకొల్పారు. 2008లో శ్రీలంకపై ఆడిన తొలి వన్డే మ్యాచ్ లో కేవలం 12 పరుగులే చేశాడు. దాంతో విమర్శలు వచ్చాయి. వాటన్నింటినీ పట్టించుకోని విరాట్.. నాలుగో వన్డేలో హాఫ్ సెంచరీ చేసి అందరి నోళ్లు మూయించాడు. అప్పుడు మొదలుపెట్టి ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నాడు. అందరి కెరీర్ లో ఉన్నట్లే కోహ్లీ కెరీర్ లో కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొక తప్పలేదు. గడిచిన మూడేళ్లలో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. తన 71వ సెంచరీ చేయడానికి 3 ఏళ్లు పట్టింది. కానీ, చివరికి ఆసియా కప్ 2022లో విరాట్ దెబ్బతిన్న సింహంలా కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఏకంగా 6 సెంచరీలు చేసి ఫామ్ అందుకున్నాడు. కోహ్లీ ఖాతాలో మోస్ట్ ఇంటర్నేషనల్ రన్స్, అత్యధిక వన్డే, టీ20 రన్స్, మోస్ట్ డబుల్ సెంచరీలు, మోస్ట్ సెంచరీలు, మోస్ట్ హాఫ్ సెంచరీలు, అత్యధిక ఐసీసీ రన్స్, అత్యధిక ఐసీసీ అవార్డ్స్, మోస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ, మోస్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్లు ఉన్నాయి.



Updated : 18 Aug 2023 5:08 PM IST
Tags:    
Next Story
Share it
Top