Virat Kohli : వరల్డ్ కప్లో కోహ్లీ రికార్డు.. తొలి బ్యాట్స్మెన్గా..
X
వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ రికార్డ్ సృష్టించారు. ప్రపంచకప్లోని ఒక సీజన్లో అత్యధిక రన్స్ చేసిన తొలి బ్యాటర్గా నిలిచారు. ఇవాళ జరుగుతున్న ఫైనల్లో 54 రన్స్ చేశారు. దీంతో ఈ సీజన్లో 765 చేసిన విరాట్ చరిత్ర సృష్టించాడు. అటు టీ20 వరల్డ్ కప్లోనూ అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. 2014 టీ20 వరల్డ్ కప్లో కోహ్లీ 319 రన్స్ చేసి రికార్డు నమోదు చేశాడు. అటు ఐపీఎల్ రికార్డు సైతం కోహ్లీ పేరు మీదే ఉంది. 2016 ఐపీఎల సీజన్లో 973 రన్స్ చేసిన విరాట్ ఒక సీజన్ లో ఎక్కువ పరుగలు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచారు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా తడబడుతోంది. 149 రన్స్కే 4వికెట్లు కోల్పోయింది. కీలకమైన బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ (54) కమ్మిన్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ 50, జడేజా 9రన్స్ తో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ 2వికెట్లతో భారత్ను దెబ్బకొట్టాడు.
కాగా ఆదిలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్క్ వేసిన నాలుగో ఓవర్లో 30 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ (4) ఔటయ్యాడు. ఆ తర్వాత 9.4వ ఓవర్లో రోహిత్ శర్మ (47) ఔటయ్యాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ చేతికి చిక్కాడు. ఆ వెంటనే కమిన్స్ బౌలింగ్‌లో కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చి శ్రేయస్ (4) పెవిలియన్‌కు చేరాడు. దీంతో 81 పరుగులకే టిమిండియా మూడో వికెట్లు నష్టపోయింది.