Home > క్రీడలు > Virat Kohli : సెంచరీతో చెలరేగిన బర్త్ డే బాయ్ కోహ్లీ.. సచిన్ రికార్డు సమం..

Virat Kohli : సెంచరీతో చెలరేగిన బర్త్ డే బాయ్ కోహ్లీ.. సచిన్ రికార్డు సమం..

Virat Kohli   : సెంచరీతో చెలరేగిన బర్త్ డే బాయ్ కోహ్లీ.. సచిన్ రికార్డు సమం..
X

ఈడెన్ గార్డెన్స్ ఓ అద్భుతానికి వేదికైంది. క్రికెట్ గాడ్ సచిన్ నెలకొల్పిన రికార్డును విరాట్ కోహ్లీ సమం చేసిన క్షణానికి సాక్ష్యంగా నిలిచింది. వరల్డ్ కప్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన కీలక పోరులో బర్త్ డే బాయ్ విరట్ కోహ్లీ రెచ్చిపోయాడు. సెంచరీతో చెలరేగి.. సౌతాఫ్రికా బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఫోర్లతో సఫారీలను పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 49వ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ సచిన్ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో

సచిన్ తన కేరీర్లో 463 వన్డేలు ఆడి 49 సెంచరీలు చేశాడు. అటు కింగ్ కోహ్లీ మాత్రం 289 మ్యాచ్‌లలో ఈ రికార్డును సమం చేశాడు. తన బర్త్ డే రోజే సచిన్ రికార్డును సమం చేయడం విశేషం. అటు హాఫ్ సెంచరీల్లోనూ విరాట్ రికార్డు నెలకొల్పాడు. వన్డే చరిత్రలోనే అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 118 హాఫ్ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్న సంగక్కర రికార్డును 119 హాఫ్ సెంచరీలతో కోహ్లీ బద్దలగొట్టాడు. కాగా 145 హాఫ్ సెంచరీలతో సచిన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు.

కాగా ఈ మ్యాచ్లో కోహ్లీ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా నిర్ణీత 50ఓవర్లలో 326 రన్స్ చేసింది. 121 బాల్స్లో 101 రన్నులు చేసి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలకంగా నిలిచాడు. రోహిత్ 40, గిల్ 23 రన్స్ కే ఔటైనా.. కోహ్లీ శ్రేయస్ అయ్యర్ తో కలిసి కీలక పార్టనర్షిప్ నెలకొల్పాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు 134 రన్స్ జోడించారు. 77 రన్స్ అయ్యర్.. మార్క్రామ్కు క్యాచ్ ఔటవ్వగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లతో కలిసి కోహీ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. చివర్లో వచ్చిన జడేజా 15బంతుల్లో 29 రన్స్ చేసి రాణించాడు.

Updated : 5 Nov 2023 6:42 PM IST
Tags:    
Next Story
Share it
Top