Home > క్రీడలు > 13 ఏళ్లలో మొదటిసారి ఇలా.. ఆందోళనలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్

13 ఏళ్లలో మొదటిసారి ఇలా.. ఆందోళనలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్

13 ఏళ్లలో మొదటిసారి ఇలా.. ఆందోళనలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్
X

ప్రపంచ క్రికెట్కు ఫిట్నెస్ గురువు ఎవరంటే.. టక్కున చెప్పే పేరు విరాట్ కోహ్లీ. తన కెరీర్ లో ఇప్పటి వరకు గాయం లేదా ఏ ఇతర కారణంగా జట్టుకు దూరం కాలేదు. ప్రతీసారి కుర్రాళ్లకు చాన్స్ ఇద్దామనే కారణంతో బీసీసీఐ.. కోహ్లీకి రెస్ట్ ఇచ్చింది. కాగా స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కు కోహ్లీ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు మ్యాచులకు అందుబాటులో ఉండడని బీసీసీఐ మొదట ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం కోహ్లీ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడని బీసీసీఐ ప్రకటించింది. అందుకే మిగిలిన మూడు మ్యాచులకు టీంను ప్రకటించగా.. అందులో కోహ్లీని ఎంపిక చేయలేదు. 2011లో టెస్ట్ క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ.. ఈ 13 ఏళ్ల ప్రయాణంలో ఏ టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరం కాలేదు. 13 ఏళ్లలో ఫిట్ నెస్, ఫామ్ లేవి వంటి కారణాలేమీ కోహ్లీని అడ్డుకోలేకపోయినా.. తొలిసారి ఓ వ్యక్తిగత కారణాల వల్ల ఓ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.

2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కోహ్లీ.. ఇప్పటివరకు 113 మ్యాచులు ఆడాడు. స్వదేశంలో జరిగిన సిరీసుల్లో మూడు మాత్రమే కోహ్లీ మిస్ అయ్యాడు. 2017లో బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టు, 2018లో అఫ్గానిస్తాన్‌తో బెంగళూరుతె జరిగిన ఏకైక టెస్టు, 2021లో న్యూజిలాండ్‌తో కాన్పూర్‌ టెస్టుల్లో మాత్రమే జట్టుకు దూరమయ్యాడు. తాజాగా ఈ సిరీస్ మొత్తానికి కోహ్లీ దూరమయ్యాడు. ఈ 13 ఏళ్లలో కోహ్లీ మిస్ అయిన టెస్టు మ్యాచులు 13 మాత్రమే. స్వదేశంలో 3 మ్యాచులకు దూరం అయిన కోహ్లీ, విదేశాల్లో జరిగిన 10 టెస్టులను మిస్ అయ్యాడు. కాగా విరాట్ కోహ్లీ సిరీస్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

Updated : 10 Feb 2024 1:19 PM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top