గొప్ప మనసు చాటుకున్న విరాట్ కోహ్లీ.. సౌతాఫ్రికా ఫ్యాన్స్ ఫిదా
X
కీలక సమయంలో వికెట్ పడితే ఎలా ఉంటది. సెంచరీ చేసి సూపర్ ఫామ్ లో ఉన్న బ్యాటర్ సింగిల్ డిజిట్ స్కోర్ ఔట్ అయితే ఎలా ఉంటది. అనుక్షణ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో.. ఎమోషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ప్రతీ రన్, ప్రతీ వికెట్ కీలకంగానే ఉంటుంది. అలాంటి సమయంలో విరాట్ కోహ్లీ చాటిన క్రీడా స్పూర్తికి సౌతాఫ్రికా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కోహ్లీని కొనియాడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే..
బుధవారం కేప్ టౌన్ వేదికగా జరిగిన సౌతాఫ్రికా- భారత్ రెండో టెస్ట్ రసవత్తరంగా సాగింది. తొలిరోజే 23 వికెట్లు పడ్డాయి. పేస్ పిచ్ పై ఇరు జట్ల బౌలర్లు నిప్పులు చెరిగారు. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 55 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ 11 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. 62 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. కాగా చివరి టెస్ట్ ఆడుతున్న ఓపెనర్ డీన్ ఎల్గర్ 12 పరుగులకే ఔట్ అయ్యాడు. ఔట్ అయ్యాక ఎల్గర్ పెవిలియన్ కు వెళ్తుండగా.. అతని వికెట్ తీసిన ముకేశ్ కుమార్, టీమిండియా సంబరాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో కోహ్లీ జట్టును సెలబ్రేట్ చేసుకోవద్దని సూచించాడు.
తనకు గౌరవంగా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి ఎల్గర్ ను హత్తుకున్నాడు. మిగతావారిని కూడా స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాల్సిందిగా సూచించాడు. అలా తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న డీన్ ఎల్గర్‌కు కోహ్లి ఘనమైన విడ్కోలు పలికాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. క్రీడా స్పూర్తిని చాటిన కోహ్లీ.. అభిమానుల మనసు గెలుచుకున్నాడు.